ETV Bharat / sports

WTC FINAL: అశ్విన్ మరో నాలుగు వికెట్లు తీస్తే..

డబ్ల్యూటీసీలో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లలో అగ్రస్థానంలో నిలిచేందుకు అశ్విన్.. అడుగు దూరంలో ఉన్నాడు. మరో నాలుగు వికెట్లు తీస్తే అతడు టాప్​లోకి వెళతాడు.

Ashwin on the cusp of ending as top wicket taker
రవిచంద్రన్ అశ్విన్
author img

By

Published : May 28, 2021, 9:56 AM IST

Updated : May 28, 2021, 11:39 AM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​(World Test Championship) అత్యధిక వికెట్ల వీరుడి నిలిచేందుకు.. టీమ్​ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కొద్ది దూరంలో ఉన్నాడు. జూన్ 18న న్యూజిలాండ్​తో జరిగే ఫైనల్​లో నాలుగు వికెట్లు తీస్తే అగ్రస్థానానికి చేరుకుంటాడు.

ఈ టోర్నీలో ఇప్పటివరకు 13 మ్యాచ్​ల్లో 67 వికెట్లు తీయగా, 14 మ్యాచ్​లాడిన ఆసీస్ పేసర్ కమిన్స్ 70 వికెట్లతో టాప్​లో కొనసాగుతున్నాడు.

Ashwin on the cusp of ending as top wicket taker
రవిచంద్రన్ అశ్విన్

అయితే టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్​కు వేదికైన సౌతాంప్టన్​ పిచ్, ప్రస్తుత వాతావరణం దృష్ట్యా పేసర్లకు అనుకూలించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు అశ్విన్​కు తుది జట్టులో చోటు లభిస్తుందా అనేది కూడా చూడాలి.

ఈ మ్యాచ్​ కోసం త్వరలో ఇంగ్లాండ్​ వెళ్లనున్న టీమ్​ఇండియా.. దీని తర్వాత ఇంగ్లీష్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్​లో తలపడనుంది. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్య ఈ మ్యాచ్​లు జరగనున్నాయి.

ఇది చదవండి: IPL2021: 8-9 రోజులు సరిగా నిద్రపోలేదు: అశ్విన్

Last Updated : May 28, 2021, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.