Smrithi Mandana injury: ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన ఓ వార్మప్ మ్యాచ్‌లో గాయపడిన భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిసింది. దీంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆమె మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించినట్లు సమాచారం. ప్రపంచకప్‌కు అందుబాటులోనే ఉంటుందని క్రికెట్ వర్గాలు తెలిపాయి.
కాగా, దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో స్మృతి తలకు గాయమైంది. భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో దక్షిణాఫ్రికా బౌలర్ ఇస్మాయిల్ బౌన్సర్ వేసింది. బౌన్సర్ బంతిని పుల్ షాట్ ఆడటానికి మంధాన ప్రయత్నించగా.. అది మిస్ అయ్యి మంధాన హెల్మెట్‌కు బలంగా తగిలింది. అమెకు వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. అయితే తలకు గాయం అవ్వడం వల్ల ఆమె ప్రపంచకప్‌కు దూరం అవుతుందేమోనని ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలోనే ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్లు తాజా సమాచారం బయటకు వచ్చింది.
మహిళల వన్డే ప్రపంచకప్ మార్చి 4వ తేదీ నుంచి జరగనుంది. న్యూజిలాండ్ వేదికగా ఈ మెగాటోర్నీని నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: 'జట్టులో స్థానం గురించి అసలు ఆలోచించను!'