ETV Bharat / sports

ఫ్యాన్స్​ అందరికీ సేమ్​ డౌట్!- రోహిత్-విరాట్​ గమనం ఎటో? - రోహిత్ శర్మ కెరీక్

World Cup 2023 Team India :2023 వన్డే ప్రపంచ కప్​ ముగిసింది. అయితే భారత్​ అభిమానుల ఆశలు మాత్రం కలగానే మిగిలిపోయింది. మనదే అనుకున్న ఆ బంగారు కప్పును ఆస్ట్రేలియా జట్టు సొంతమైంది. చివరి వరకు పోరాడినప్పటికీ.. టీమ్ఇండియాకు నిరాశ తప్పలేదు. అయితే ఈ టోర్నీ తర్వాచ రానున్న రోజుల్లో పలు కీలక మార్పులు జరగనున్నాయి. అదే సమయంలో కోహ్లీ, రోహిత్‌ల భవితవ్యం గురించి పలు ప్రశ్నలు అభిమానుల మదిలో తలెత్తుతున్నాయి.

World Cup 2023 Team India
World Cup 2023 Team India
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 9:36 AM IST

World Cup 2023 Team India : ఈ ఏడాది ప్రపంచ కప్​ మన సొంతం కాలేదన్న బాధ కంటే.. కోహ్లి, రోహిత్‌లకు ఇదే చివరి కప్పు కావచ్చన్న అంచనాలు అభిమానులను ఆవేదనకు గురి చేస్తోంది. 2011 కప్పు గెలిచిన జట్టులో కోహ్లీ సభ్యుడైనప్పటికీ.. ఆ విజయంలో అతడి పాత్ర నామమాత్రమే. అయితే విరాట్​.. ఓ సూపర్‌ స్టార్‌గా ఎదిగాక జట్టుకు కప్పు అందిస్తే చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ఇక ఈ మెగా టోర్నీలో 3 శతకాలు సహా 765 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచిన విరాట్‌.. జట్టును విజేతగా నిలపడానికి తనవంతు కృషి చేశాడు. జట్టు గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నించాడు.

మరోవైపు 2011 ప్రపంచకప్‌ జట్టులో భాగం కాలేకపోయిన రోహిత్‌కు.. ఈసారి కెప్టెన్‌గా జట్టును నడిపించే అవకాశం వరించింది. ఓ కెప్టెన్‌గానే కాకుండా ఓ బ్యాటర్‌గానూ గొప్ప రోహిత్ ప్రదర్శన చేశాడు. వెన్నంటే ఉండి జట్టుకు పలు విజయాలను అందించాడు. ఆడిన 11 మ్యాచ్‌ల్లో 597 పరుగులు సాధించిన హిట్ మ్యాన్​.. ఓ నాయకుడిగా అతడి నైపుణ్యాలను చూపించి సత్తా చాటారు. కానీ ఈ ఇద్దరూ స్టార్ క్రికెటర్లు కప్పుకి అడుగు దూరంలో నిలిచిపోవడం పట్ల అభిమానులు నిరాశ చెందుతున్నారు.

ప్రస్తుతం రోహిత్‌ శర్మ వయసు 36 ఏళ్లు. తనకంటే విరాట్​ ఏడాదే చిన్నవాడు. కెరీర్ పీక్​ స్టేజ్​లో ఉన్న ఈ ఇద్దరూ ఇంకో నాలుగేళ్ల తర్వాత జరిగే వన్డే ప్రపంచకప్‌లో ఆడటం కష్టమే అని విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పటి రోజులంటే వేరు కానీ.. ఇప్పుడు వన్డేలకు కూడా ప్రాధాన్యం బాగా తగ్గిపోయింది. వన్డే ప్రపంచకప్‌ జరగడానికి ఒకట్రెండేళ్ల ముందు మాత్రమే తరచుగా ఆ ఫార్మాట్లో మ్యాచ్‌లు జరుగుతుండేవి. అయితే వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ ఉండటం వల్ల భారత్‌ సహా ఏ జట్టూ సంవత్సరం పాటు పెద్దగా వన్డేలు ఆడే అవకాశాలు కనిపించటం లేదు. ఆ తర్వాత కూడా ఎప్పటికి తరచుగా వన్డేలు ఆడతారో లేదో కూడా తెలియదు.

ఈ లోపు భవిష్యత్‌ దిశగా జట్టు ప్రణాళికలు మారిపోవచ్చు. 2027 ప్రపంచకప్‌ దిశగా యంగ్​ ప్లేయర్స్​కు ఛాన్స్​ ఇవ్వాలని.. బోర్డు, సెలక్టర్లు భావించవచ్చు. మరోవైపు వన్డేలు శారీరకంగా, మానసికంగా అనేక సవాళ్లు విసురుతాయి కాబట్టి వయసు పెరుగుతున్న రోహిత్‌, కోహ్లి.. ఇక చాలనుకుని ఈ ఫార్మాట్‌లో రిటైర్మెంట్​ చెప్పే అవకాశాలు లేకపోలేదు. అయితే ఇటీవలి ప్రపంచకప్‌లో ఈ ఇద్దరి ప్రదర్శన తర్వాత వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగితే బాగుంటుందనే ఆశ అభిమానుల్లో కలుగుతోంది. ఎలాగో ఐపీఎల్‌లోనూ ఆడతారు. అందులో కూడా దూకుడు చూపించారంటే కోహ్లి, రోహిత్‌ టీ20 ప్రపంచకప్‌లో ఆడాలన్న డిమాండ్​లు కూడా పెరగొచ్చు. ఆ టోర్నీలో వాళ్లిద్దరూ జట్టుకు సపోర్ట్ అవుతారని అభిమానుల ఆశ. దీంతో టీ20ల్లోకి వీరు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

ద్రవిడ్‌ పరిస్థితేంటి?
Rahul Dravid Head Coach Tenure : మరోవైపు కోహ్లి, రోహిత్‌లతో పాటు టీమ్‌ఇండియా హెడ్ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ భవితవ్యం మీదా కూడా చర్చలు మొదలయ్యాయి. ఈ వన్డే ప్రపంచకప్‌తోనే ద్రవిడ్​ రెండేళ్ల పదవీ కాలం ముగిసింది. ఈ క్రమంలో ఫైనల్‌ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో ద్రవిడ్ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. తన పదవీ కాలం ముగిసిందని, కానీ తన భవితవ్యంపై ఏమీ ఆలోచించట్లేదని పేర్కొన్నాడు. ప్రస్తుతానికి కొంత కాలం ద్రవిడ్‌ విశ్రాంతి తీసుకోనున్నాడట. దీంతో ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌కు హెడ్​ కోచ్​ రాహుల్ అందుబాటులోకి ఉండకపోవచ్చు.

వచ్చే నెలలో టీ20 సిరీస్‌ కోసం టీమ్ఇండియా దక్షిణాఫ్రికాకు వెళ్లనుంది. అప్పటికి ద్రవిడ్‌ భవితవ్యమేంటన్న విషయంపై ఓ క్లారిటీ రావచ్చు. అయితే రెండేళ్ల కిందట అయిష్టంగా ద్రవిడ్‌.. చీఫ్‌ కోచ్‌ బాధ్యతలు చేపట్టాడు. అందులో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ కీలక పాత్ర పోషించాడు. దీంతో ఇప్పుడు ద్రవిడ్‌ను కొనసాగమని బోర్డు ఒత్తిడి తెస్తుందా అన్నది సందేహం నెలకొంది. అతను కూడా కొనసాగడానికి ఇష్టపడతాడా లేదా అన్నది కూడా ప్రశ్నే. కోచ్‌గా కొనసాగే ఆలోచన ఉందేమోనని ద్రవిడ్‌ను ఒకసారి అడిగి.. అతను ఓకే అంటే ఇక తన పదవీకాలాన్ని ఇంకో ఏడాది పొడిగించే అవకాశముంది. అయితే అతను కొనసాగనంటే మాత్రం కొత్త కోచ్‌ ఎంపిక ప్రక్రియను త్వరలోనే బీసీసీఐ మొదలెట్టే అవకాశాలున్నాయి.

చరిత్ర సృష్టించిన విరాట్​ కోహ్లీ- ఈ వరల్డ్​ కప్​లో నమోదైన రికార్డులివే!

వరల్డ్​ కప్​ ఫైనల్​ ఫీవర్​- టీవీలు, ఫోన్లకు అతుక్కుపోయిన అభిమానులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.