World Cup 2023 Final Events : 2023 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌ను బీసీసీఐ గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ముగింపు వేడుకలు అట్టహాసంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వాయుసేన విన్యాసాలు, సెలబ్రిటీల పెర్ఫార్మెన్స్లు ఉండనున్నట్లు ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. అయితే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఫైనల్ మ్యాచ్ జరగనున్నట్లు బీసీసీఐ అధికారికంగా తెలిపింది. ఎప్పుడెప్పుడు ఏయే కార్యక్రమాలు ఉంటాయో ట్విట్టర్ వేదికగా పేర్కొంది.
- మ్యాచ్‌కు ముందు.. మ్యాచ్ ప్రారంభానికి ముందు మధ్యాహ్నం 1.35 నుంచి 1.50 గంటల మధ్య వాయుసేన విన్యాసాలు జరగనున్నాయి. భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఏవియేషన్ బృందం.. ఈ షో నిర్వహించనుంది.
- 1st డ్రింక్స్ బ్రేక్.. గుజరాత్‌కు చెందిన ప్లేబ్యాక్ సింగర్ ఆదిత్య గాధ్వి.. పెర్ఫార్మెన్స్ ఉండనుంది. పలు గుజరాతీ సినిమాల్లో ఆదిత్య గాధ్వికి పనిచేసిన అనుభవం ఉంది. పలు భాషల్లోనూ ఆదిత్య పాటలు పాడాడు.
- ఇన్నింగ్స్ బ్రేక్.. తొలి ఇన్నింగ్స్ తర్వాత బ్రేక్ సమయంలో అద్భతమైన సాంస్కృతిక కార్యక్రమం ఉండనుంది. ఈ కార్యక్రమంలో పాపులర్ సింగర్స్.. ప్రీతమ్ చక్రబొర్తీ, జొనితా గాంధీ, నకాశ్ అజీజ్, అమిత్ మిశ్రా, అక్సా సింగ్, తుషార్ జోషి ప్రదర్శన ఉండనుంది.
- 2nd డ్రింక్స్ బ్రేక్.. రెండో ఇన్నింగ్స్ విరామం సమయంలో లేజర్ లైట్ షో ఉండనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
-
It doesn't get any bigger than this 👌👌
— BCCI (@BCCI) November 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The ICC Men's Cricket World Cup 2023 Final is filled with stellar performances and an experience of a lifetime 🏟️👏#CWC23 pic.twitter.com/nSoIxDwXek
">It doesn't get any bigger than this 👌👌
— BCCI (@BCCI) November 18, 2023
The ICC Men's Cricket World Cup 2023 Final is filled with stellar performances and an experience of a lifetime 🏟️👏#CWC23 pic.twitter.com/nSoIxDwXekIt doesn't get any bigger than this 👌👌
— BCCI (@BCCI) November 18, 2023
The ICC Men's Cricket World Cup 2023 Final is filled with stellar performances and an experience of a lifetime 🏟️👏#CWC23 pic.twitter.com/nSoIxDwXek
-
అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైళ్లు.. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా టీమ్ఇండియా ఫ్యాన్స్ ఇప్పటికే భారీ సంఖ్యలో అహ్మదాబాద్ చేరుకుంటున్నారు. అయితే ఈ మ్యాచ్ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే.. ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు మూడు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే అధికారి జితేంద్ర కుమార్ తెలిపారు.
- మొదటి ట్రైన్.. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ నుంచి అహ్మదాబాద్‌కు నవంబర్ 18 రాత్రి 10.30 గంటలకు బయల్దేరుతుంది. 19 నవంబర్ ఉదయం 6.40 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది.
- రెండో ట్రైన్.. బాంద్రా టెర్మినస్ నుంచి నవంబర్ 18 రాత్రి 11.45 గంటలకు బయల్దేరి.. 19 నవంబర్ ఉదయం 7.20కు అహ్మదాబాద్ చేరుకుంటుంది.
- మూడో ట్రైన్.. ముంబయి సెంట్రల్ - అహ్మదాబాద్.. నవంబర్ 18 రాత్రి బయల్దేరి.. 19 నవంబర్ ఉదయం 8.45 గంటలకు చేరనుంది.
-
VIDEO | "Western Railway has decided to run special trains from Mumbai to Ahmedabad for cricket lovers who want to travel to Ahmedabad to watch the World Cup final," says Jitendra Kumar Jayant, Senior PRO, Ahmedabad Division, Indian Railways.
— Press Trust of India (@PTI_News) November 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Source: Third Party)… pic.twitter.com/cUF8DambJS
">VIDEO | "Western Railway has decided to run special trains from Mumbai to Ahmedabad for cricket lovers who want to travel to Ahmedabad to watch the World Cup final," says Jitendra Kumar Jayant, Senior PRO, Ahmedabad Division, Indian Railways.
— Press Trust of India (@PTI_News) November 18, 2023
(Source: Third Party)… pic.twitter.com/cUF8DambJSVIDEO | "Western Railway has decided to run special trains from Mumbai to Ahmedabad for cricket lovers who want to travel to Ahmedabad to watch the World Cup final," says Jitendra Kumar Jayant, Senior PRO, Ahmedabad Division, Indian Railways.
— Press Trust of India (@PTI_News) November 18, 2023
(Source: Third Party)… pic.twitter.com/cUF8DambJS
-
వాయుసేన విన్యాసాలు, పాప్ సింగర్ ప్రదర్శన, మోదీ హాజరు- ప్రపంచకప్ ఫైనల్ అదిరిపోవాల్సిందే!
ఫైనల్ మ్యాచ్‌కు రావొద్దు - అమితాబ్‌కు నెటిజన్లు స్వీట్ వార్నింగ్!