World Cup 2023 Final : ఇప్పుడు క్రికెట్ ప్రపంచం కళ్లన్నీ భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌పైనే ఉన్నాయి. పుష్కర కాలం తర్వాత ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్ఇండియా అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్పును ఒడిసిపట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే 2003కు 2023కు ఉన్న పోలికలను ఒకసారి పరిశీలిస్తే ఈసారి కప్పు మనదే అని చాలామంది అంచనా వేస్తున్నారు. అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది ఒకేలా ఉందని చెబుతున్నారు.
అంచనాలు నిజమైతే ముచ్చటగా మూడోసారి టీమ్ఇండియా కప్పు గెలవడం ఖాయమేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2003 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో భారీ అంచనాలతో ప్రపంచకప్ బరిలోకి దిగిన టీమ్‌ఇండియా లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారత్ చేతిలో ఓడిపోయింది. 2003 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో కంగారుల చేతిలో టీమ్ఇండియా ఓడిపోతే 2023 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో రోహిత్ సేన చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది.
India Vs Australia World Cup : 2003 ప్రపంచ కప్‌లో లీగ్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత టీమ్ఇండియా వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఈ ప్రపంచకప్‌లోనూ తొలి రెండు మ్యాచుల్లో పరాజయం పాలైన తర్వాత ఆస్ట్రేలియా వరుస విజయాలు సాధించి ఫైనల్ చేరింది. 2003 ప్రపంచకప్‌లో ఫైనల్లో విజయం సాధించి మూడోసారి ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.
ఇప్పుడు 2023లో కప్పు కైవసం చేసుకుంటే టీమ్ఇండియా మూడోసారి ఆ ఘనత సాధిస్తుంది. అంటే ఈ సారి ఆస్ట్రేలియాపై టీమ్ఇండియా విజయం సాధిస్తే ముచ్చటగా మూడోసారి కప్పు భారత జట్టు వశమవుతుంది. 2003 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఒక్క పరాజయం కూడా లేకుండా పైనల్ చేరి కప్పును దక్కించుకుంది. ఈసారి రోహిత్ సేన ఒక్క పరాజయం లేకుండా తుదిపోరుకు చేరుకుంది. అంటే 2003లో ఒక్క ఓటమి లేకుండా ఆస్ట్రేలియా కప్పు గెలిస్తే 2023లో రోహిత్ సేన కూడా అదే స్థితిలో ఉంది. అప్పుడు ఆస్ట్రేలియా గెలిస్తే ఇప్పుడు రోహిత్ సేన గెలిచేందుకు సిద్ధంగా ఉంది.
ఫైనల్ మ్యాచ్‌కు రావొద్దు - అమితాబ్‌కు నెటిజన్లు స్వీట్ వార్నింగ్!
లేజర్ లైట్ షో, బాలీవుడ్ సింగర్స్ పెర్ఫార్మెన్స్ - బీసీసీఐ ప్లాన్ అదుర్స్- షెడ్యూల్ ఇదే