World Cup 2023 Black Tickets : వరల్డ్ కప్ పేరిట రోజుకో మోసం బయటపడుతోంది. బ్లాక్ టికెట్ల దందాతో విక్రేతలు ఎంతో మంది అభిమానులను బోల్తా కొట్టిస్తున్నారు. మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధర ఉన్న టిక్కెట్లను సైతం ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇటీవలే భారత్ -సౌతాఫ్రికా మ్యాచ్ సమయంలో ఇదే పరిస్థితి నెలకొనగా.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. న్యూజిలాండ్‌తో భారత్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో బ్లాక్ టికెట్ విక్రేతలు రెచ్చిపోయారు. టికెట్లను హాట్‌కేకుల్లా అమ్మడం మొదలెట్టారు. ఆఖరికి పోలీసుల చొరవతో ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు.
అసలేం జరిగిందంటే ?
India Vs Newzealand Semi Finals Tickets : వాంఖడే స్టేడియం వేదికగా భారత్ - న్యూజిలాండ్ మధ్య జరగనున్న పోరుకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే టికెట్లు అందుబాటులోకి రాగా.. అవన్నీ త్వరగానే అమ్ముడైపోయాయి. దీంతో క్రికెట్ లవర్స్ టికెట్ల కోసం వేట మొదలెట్టారు. ఇదే అదునుగా చేసుకున్న ఓ వ్యక్తి.. సుమారు రూ.2500 నుంచి రూ.4000 ఉన్న మ్యాచ్ టిక్కెట్‌ను రూ. 27,000 నుంచి రూ. 2,50,000 ధరకు అమ్మాడు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న మహారాష్ట్ర పోలీసులు మలాడ్‌కు చెందిన ఆకాశ్ కొఠారి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై చీటింగ్ కేసును నమోదు చేసి తదుపరి దర్యాప్తను ముమ్మరం చేశారు.
మరోవైపు వాంఖడే వేదికగా నవంబర్ 15న తొలి సెమీస్ జరగనుంది. ఇప్పటికే ఈ వేదికపై పలు జట్లు లీగ్ మ్యాచుల్లో అత్యుత్తమ స్కోర్లను నమోదు చేయగా.. ఈ సారి కూడా అదే స్థాయిలో రికార్డులు నమోదవనున్నాయని క్రికెట్ లవర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత జట్టు కోచింగ్ సిబ్బంది సోమవారం వాంఖడే పిచ్‌ను పరిశీలించారు. ఇక ఇదే వేదికపై ఇటీవలే 'ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్'లో స్థానం సంపాదించుకున్న వీరేంద్ర సెహ్వాగ్, అరవింద డి సిల్వా, డయానా ఎడల్జీలకు సన్మానం జరగనుంది.
'ప్లేయర్ ఆఫ్ ది అక్టోబర్ మంత్'గా రచిన్ రవీంద్ర - ఆ స్టార్ పేసర్‌ను దాటి!
వరల్డ్ కప్ మ్యాచ్‌లకు పోటెత్తిన అభిమానులు- రికార్డు స్థాయిలో 10 లక్షలకు పైగా ప్రేక్షకులు హాజరు