World Cup 2023 Afghanistan : వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ జట్టు సంచలన విజయాలు సాధిస్తోంది. ఆడిన ఆరు మ్యాచ్‌లుల్లోనూ మూడింటిలో నెగ్గి మంచి ఫామ్‌లో ఉంది. టోర్నీ తొలి మ్యాచ్‌లలో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల చేతిలో ఘోర పరాభవాన్ని చవి చూసిన అఫ్గాన్.. ఆ తర్వాత వేగం పుంజుకుని తాజాగా ఇంగ్లాండ్, పాకిస్థాన్‌లను చిత్తు చేసింది. అంతే కాకుండా సోమవారం(అక్టోబర్ 30)న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో హ్యాట్రిక్ కొట్టి షాకిచ్చింది.
ఒకప్పుడు ఛాంపియన్‌గా నిలిచిన ఆ మూడు జట్లను ఓడించడం అంటే అంత సులభం కాదు. కానీ అటువంటి బలమైన టీమ్స్‌నే ఇంటిదారి పట్టించేలా చేసింది అఫ్గాన్ జట్టు. శ్రీలంకపై విజయంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకిన అఫ్గన్ జట్టు.. తమకున్న సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు టాప్-4లో నిలిచేందుకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయో ఓ సారి చూద్దాం.
ఇప్పుడున్న పాయింట్ల పట్టికలో అఫ్గాన్ కంటే ముందు భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఉన్నాయి. ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, సౌతాఫ్రికాతో అఫ్గాన్ జట్టు ఇంకా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో అఫ్గాన్ భారీ తేడాతో గెలిస్తే సెమీస్‌కు చేరే అవకాశం ఉంది. దీంతో ఆస్ట్రేలియా కూడా ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచినా సరిపోతుంది. అప్పుడు ఈ రెండు జట్లు 12 పాయింట్లతో ఉంటాయి. అప్పుడు నెట్‌రన్‌రేట్ మెరుగ్గా ఉన్న జట్టు టాప్ పొజిషన్‌కు చేరుకుంటుంది.
అయితే ఒకవేళ అఫ్గానిస్థాన్ తన మూడు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో ఓడినప్పటికీ.. ఆ జట్టుకు సెమీస్‌కు చేరుకునే అవకాశాలుంటాయి. అలా జరగాలంటే ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్ తమ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు మూడు జట్లు 10 పాయింట్లతో ఉంటాయి. ఇక్కడ కూడా నెట్‌రన్‌రేట్ మెరుగ్గా ఉన్న జట్లు ముందుకు సాగుతాయి. అయితే సౌతాఫ్రికా ప్రస్తుతం 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఒకవేళ ఆ జట్టు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడితే.. అఫ్గాన్ ఈ అవకాశాన్ని ఈజీగా అందిపుచ్చుకోవచ్చు.
-
𝐀𝐬 𝐓𝐡𝐢𝐧𝐠𝐬 𝐒𝐭𝐚𝐧𝐝! 📈#AfghanAtalan | #CWC23 | #WarzaMaidanGata pic.twitter.com/QiQZnGVA1g
— Afghanistan Cricket Board (@ACBofficials) October 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">𝐀𝐬 𝐓𝐡𝐢𝐧𝐠𝐬 𝐒𝐭𝐚𝐧𝐝! 📈#AfghanAtalan | #CWC23 | #WarzaMaidanGata pic.twitter.com/QiQZnGVA1g
— Afghanistan Cricket Board (@ACBofficials) October 31, 2023𝐀𝐬 𝐓𝐡𝐢𝐧𝐠𝐬 𝐒𝐭𝐚𝐧𝐝! 📈#AfghanAtalan | #CWC23 | #WarzaMaidanGata pic.twitter.com/QiQZnGVA1g
— Afghanistan Cricket Board (@ACBofficials) October 31, 2023
SL vs AFG World Cup 2023 : శ్రీలంకపై అఫ్గాన్ ఘన విజయం.. వరల్డ్ కప్‌లో ముచ్చటగా మూడో గెలుపు
ODI World Cup 2023 PAK VS AFG : అఫ్గాన్ సంచలన విజయం వెనక టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్!