ETV Bharat / sports

ఇంగ్లాండ్​కు ఎదురుదెబ్బ.. మూడో టెస్టుకు స్టార్ పేసర్ దూరం - భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టు

ఇంగ్లాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ పేసర్ భారత్​తో జరగనున్న మూడో టెస్టుకు దూరమయ్యాడు.

Wood
వుడ్
author img

By

Published : Aug 23, 2021, 7:14 PM IST

టీమ్‌ఇండియాతో టెస్టు సిరీస్‌ ఆడుతున్న ఇంగ్లాండ్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులోని కీలక పేసర్‌ మార్క్‌ వుడ్‌ మూడో టెస్టుకు దూరమయ్యాడు. అతడి కుడి భుజానికి గాయమవడం వల్ల తర్వాతి మ్యాచ్‌లో ఆడటంలేదని ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. గతవారం లార్డ్స్‌ మైదానం వేదికగా జరిగిన రెండో టెస్టులో వుడ్‌ నాలుగో రోజు ఫీల్డింగ్‌ చేస్తూ కిందపడ్డాడు. దాంతో అతడి కుడి భుజానికి గాయమైందని ఆ జట్టు పేర్కొంది.

కాగా, ఇంతకుముందే ఇంగ్లాండ్‌ జట్టులో ప్రధాన పేసర్లు.. స్టువర్ట్‌ బ్రాడ్‌, జోఫ్రా ఆర్చర్‌ గాయాల కారణంగా పర్యటన నుంచి వైదొలిగారు. అలాగే స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ కూడా మానసిక ఆరోగ్య సమస్యల పేరుతో కొద్ది కాలం ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే రెండో టెస్టులో ఆడిన ఇంగ్లాండ్‌ ఐదో రోజు ఉదయం సెషన్‌ వరకూ భారత్‌పై ఆధిపత్యం చెలాయించింది. కానీ, అనూహ్యంగా బుమ్రా, షమీ తమ బ్యాటింగ్‌తో చెలరేగి ఇంగ్లాండ్‌ జట్టును కోలుకోలేని దెబ్బతీశారు. అనంతరం తమ బౌలింగ్‌ నైపుణ్యంతోనూ మెరవడం వల్ల ఇంగ్లాండ్‌ ఆ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. దాంతో ఈ సిరీస్‌లో 0-1తో వెనుకపడింది. ఈ నేపథ్యంలో మార్క్‌ వుడ్‌ కూడా దూరమవ్వడం ఆ జట్టు కష్టాలను రెట్టింపు చేసింది. అతడు ఆ మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి ఆకట్టుకోవడం గమనార్హం.

ఇవీ చూడండి: The Hundred League: ఇదే పని టీమ్ఇండియా చేసుంటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.