ETV Bharat / sports

'మహిళా క్రికెట్​కు మీడియా మద్దతు అవసరం'

మహిళా క్రికెట్​కు ఆదరణ పెరగాలంటే అందుకు మీడియా మద్దతు ఎంతో అవసరమని తెలిపింది సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్. మానసిక ఒత్తిడితో ఇటీవల ఫ్రెంచ్​ ఓపెన్​ నుంచి జపాన్ టెన్నిస్ ప్లేయర్ నవోమి ఒసాకా వైదొలగడంపై మిథాలీ తాజాగా స్పందించింది.

Mitali Raj, Women's cricket needs media support
మిథాలీ రాజ్, టీమ్ఇండియా కెప్టెన్
author img

By

Published : Jun 1, 2021, 7:26 PM IST

మీడియాకు దూరంగా ఉండాలని తానెప్పుడూ అనుకోలేదని తెలిపింది భారత మహిళా క్రికెటర్​ మిథాలీ రాజ్. ప్రస్తుత రోజుల్లో మహిళల క్రికెట్​కు ఆదరణ దక్కాలంటే మీడియా మద్దతు ఎంతో అవసరమని స్పష్టం చేసింది. జపాన్​ టెన్నిస్ ప్లేయర్​ నవోమి ఒసాకా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలిగిన నేపథ్యంలో మిథాలీ ఈ వ్యాఖ్యలు చేసింది.

"క్వారంటైన్​లో ఉండటం క్రీడాకారులకు ఎంత ఇబ్బందో నాకు తెలుసు. కానీ, మైదానంలోకి దిగాక ఇలాంటివి పక్కన పెట్టాలి. మీడియా విలువెంటో నాకు తెలుసు కాబట్టే నేనింత వరకు ప్రెస్ కాన్ఫరెన్స్​ను దూరంగా ఉండలేదు. ప్రస్తుత రోజుల్లో మహిళా క్రికెట్​కు ఆదరణ దక్కాలంటే మీడియా మద్దతు అవసరం."

-మిథాలీ రాజ్, టీమ్ఇండియా వన్డే కెప్టెన్.

ఈ విషయంపై అంతకుముందు మాజీ క్రికెటర్​ మహమ్మద్ కైఫ్​ స్పందించాడు. క్రీడాకారులకు మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనదని తెలిపాడు. టెన్నిస్, బ్యాడ్మింటన్​ వంటి వ్యక్తిగత ఆటలలో ఇది కాస్త ఎక్కువేనని పేర్కొన్నాడు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న ఆటగాళ్లకు మీడియా సమావేశాల నుంచి సడలింపులు ఇవ్వాలని సూచించాడు.

ఫ్రెంచ్​ ఓపెన్ తొలిరౌండ్‌లో విజయానంతరం మీడియా సమావేశానికి హాజరుకాకపోవడం వల్ల ఒసాకాకు రిఫరీ 15,000 డాలర్ల జరిమానా విధించారు. ఈ నేపథ్యంలో అసంతృప్తి చెందిన ఒసాకా టోర్నీ నుంచి వైదొలిగింది. మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడకుండా ఉండేందుకు తాను ఫ్రెంచ్‌ ఓపెన్‌ సందర్భంగా మీడియాతో మాట్లాడలేదని వివరణ ఇచ్చింది. 2018 యూఎస్‌ ఓపెన్‌ నుంచి తాను మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నట్లు, అందుకే తప్పుకొంటున్నట్లు ట్వీట్‌ చేసింది.

ఇదీ చదవండి: Sachin: భారత్ కంటే ముందు సచిన్, పాక్ జట్టులో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.