ETV Bharat / sports

ఐపీఎల్​ రీషెడ్యూల్​.. జోష్​లో రాజస్థాన్​ జట్టు

యూఏఈలో ఐపీఎల్​ మిగతా సీజన్​ను నిర్వహిస్తామన్న బీసీసీఐ అధికారిక ప్రకటనపై ఫ్రాంఛైజీలు సంతోషం వ్యక్తం చేశాయి. సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులు పెట్టాయి. వీటన్నింటిలో రాజస్థాన్ రాయల్స్​ షేర్​ చేసుకున్న వీడియో వైరల్​గా మారింది.

sanju samson, rahul tewatiya
సంజు శాంసన్, రాహుల్ తెవాతియా
author img

By

Published : May 29, 2021, 7:25 PM IST

ఐపీఎల్​ రెండో దశను సెప్టెంబర్​ మూడో వారంలో యూఏఈలో జరపాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిర్ణయించింది. దీనిపై లీగ్ ఫ్రాంఛైజీలు సామాజిక మాధ్యమాల వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ పలు పోస్టులు పెట్టాయి.

రాజస్థాన్ రాయల్స్​ ఓ అడుగు ముందుకేసి.. ఐపీఎల్​ రీషెడ్యూల్​పై తమ సంతోషాన్ని ప్రకటించింది. బాలీవుడ్​ సినిమా 'హే బేబీ' లోని ఓ పాటను మార్ఫింగ్ చేసింది. సినిమాలోని నటీనటులైనా అక్షయ్​ కుమార్, షారుక్ ఖాన్, అనుపమ్​ ఖేర్​ స్థానాలలో తమ జట్టు ఆటగాళ్లు సంజూ శాంసన్, రాహుల్ తెవాతియా, జోస్ బట్లర్, క్రిస్ మోరిస్.. ఫొటోలను పెట్టింది. ఆ వీడియోను తమ అధికారిక ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేసింది ఫ్రాంఛైజీ.

డిఫెండింగ్ ఛాంపియన్​ ముంబయి ఇండియన్స్​.. గతేడాది యూఏఈలో ఐపీఎల్​ ఆడిన ఫొటోను ట్విట్టర్​లో ఉంచింది. 'యూఏఈ, మేము తిరిగి వస్తున్నాము' అని క్యాప్షన్ జోడించింది.

బీసీసీఐ సర్వసభ్య సమావేశం శనివారం వర్చువల్​గా జరిగింది. ఐపీఎల్​ మిగతా సీజన్​ను యూఏఈ వేదికగా నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. సెప్టెంబర్-అక్టోబర్​ మధ్యలో లీగ్ రెండో దశ ఉంటుందని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

ఇదీ చదవండి: WTC final: టీమ్ఇండియా క్వారంటైన్ కొన్నిరోజులే​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.