ETV Bharat / sports

Wicket Keeper Highest Score vs Pakistan : 18 ఏళ్ల ధోనీ రికార్డును బద్దలుకొట్టిన అఫ్గాన్ బ్యాటర్.. పాక్​పై వికెట్ కీపర్ల టాప్ 5 స్కోర్లివే - పాకిస్థాన్​పై వికెట్ కీపర్ల అత్యధిక స్కోర్లు

Wicket Keeper Highest Score vs Pakistan : అంతర్జాతీయ వన్డే క్రికెట్​లో పాకిస్థాన్​.. పదునైన పేస్​ బౌలింగ్ ఉన్నజట్టు. అయితే అలాంటి పాక్​పై అఫ్గానిస్థాన్​కు చెందిన 21 ఏళ్ల యువ బ్యాటర్ అత్యధిక వ్యక్తిగత (151) స్కోర్ సాధించాడు. ఈ క్రమంలో అతడు భారత మాజీ ప్లేయర్.. ధోనీ రికార్డును అధిగమించాడు. ​మరి ఈ లిస్ట్​లో టాప్​ 5లో ఉన్న ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

Wicket Keeper Highest Score vs Pakistan
Wicket Keeper Highest Score vs Pakistan
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2023, 11:05 PM IST

Wicket Keeper Highest Score vs Pakistan : ప్రస్తుత మేటి క్రికెట్ జట్లలో పాకిస్థాన్ ఒకటి. నాణ్యమైన పేస్ బౌలింగ్ పాక్ సొంతం. ఇప్పుడున్న జట్టులో హరీస్ రౌఫ్, షహీన్ అఫ్రిదీ, షాదాబ్ ఖాన్​తో ఆ జట్టు బౌలింగ్ దళం పటిష్ఠంగా ఉంది. పసికూన అఫ్గానిస్థాన్​తో జరిగిన మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​ను పాక్ 3-0 తేడాతో.. క్లీన్​స్వీప్ చేసింది. ఈ సిరీస్​లో అఫ్గాన్ మూడు మ్యాచ్​ల్లో భంగపడ్డప్పటికీ.. ఆ జట్టులో ఓ యువ బ్యాటర్ సంచలన ఇన్నింగ్స్​తో అదరగొట్టాడు. అతడే రహ్మానుల్లా గుర్బాజ్.

21 ఏళ్ల ఈ బ్యాటర్ రెండో మ్యాచ్​లో పాక్​పై 100 స్ట్రైక్​ రేట్​తో 151 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఈ క్రమంలో పాక్​పై అత్యధిక పరుగులు చేసిన వికెట్​కీపర్​గా గుర్బాజ్ నిలిచాడు. ఇదివరకు ఈ రికార్డు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉండేది. తాజాగా ఆ రికార్డును గుర్బాజ్ తన సూపర్ ఇన్నింగ్స్​తో బద్దలుకొట్టాడు. మరి పాకిస్థాన్​పై ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్​లు ఎవరో తెలుసుకుందాం.

1. రహ్మానుల్లా గుర్బాజ్..
Rahmanullah Gurbaz vs Pakistan : పాకిస్థాన్ - అఫ్గానిస్థాన్ మధ్య మూడు వన్డే మ్యాచ్​ల సిరీస్​లో భాగంగా.. ఆఫ్గాన్​ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ 151 పరుగులు చేసి ఈ లిస్ట్​లో ఫస్ట్​ప్లేస్​లో కొనసాగుతున్నాడు.

Rahmanullah Gurbaz vs Pakistan
Rahmanullah Gurbaz vs Pakistan

2. ఎం ఎస్ ధోనీ..
MS Dhoni vs Pakistan : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎం ఎస్ ధోనీ 2005లో జరిగిన మ్యాచ్​లో దుమ్ముదులిపాడు. ఏకంగా 123 బంతుల్లో 148 పరుగులు చేసి సత్తా చాటాడు. దాదాపు 18 ఏళ్లుగా ధోనీ పేరిట ఉన్న ఈ రికార్డును గుర్బాజ్ తాజాగా బద్దలుకొట్టాడు.

MS Dhoni vs Pakistan
MS Dhoni vs Pakistan

3. బ్రెండన్ మెకల్లమ్..
Brendon Mccullum vs Pakistan : న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ బ్రెండన్ మెకల్లమ్.. పాక్​తో అబుదాబిలో జరిగిన మ్యాచ్​లో 131 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు మెకల్లమ్.

Brendon Mccullum vs Pakistan
Brendon Mccullum vs Pakistan

4. ఏ బీ డివిలియర్స్.. Ab De Villiers vs Pakistan : 2013లో సౌతాఫ్రికా, పాక్​ మధ్య జరిగిన వన్డేలో ఈ మిస్టర్ 360 ఆటగాడు డివిలియర్స్.. 128 పరుగులు సాధించాడు.

Ab De Villiers vs Pakistan
Ab De Villiers vs Pakistan

5. జానీ బెయిస్ట్రో..
Bairstow vs Pakistan : 2019లో ఇంగ్లాండ్ పాక్​తో తలపడింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 358 భారీ స్కోర్ సాధించింది. అనంతరం ఛేజింగ్​కు దిగిన ఇంగ్లాండ్.. బెయిస్ట్రో తుపాన్ ఇన్నింగ్స్​ (93 బంతుల్లో 128 పరుగులు) తో 31 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఇక ఈ జాబితాలో బెయిస్ట్రో ఐదో స్థానంలో ఉన్నాడు.

Bairstow vs Pakistan

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.