అప్పట్లో క్రికెటర్లు తలకు ఎలాంటి రక్షణ లేకుండానే బ్యాటింగ్ చేసేవారు. కానీ కొంతకాలంగా బ్యాట్స్‌మెన్ హెల్మెట్ ధరించడమనేది తప్పనిసరి అయిపోయింది. ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మెన్ ఫిలిప్ హ్యూస్(phillip hughes) తలకు బంతి తగిలి మరణించిన తర్వాత ఈ రూల్ మరింత కఠినంగా మారింది. అయితే బ్యాట్స్‌మెన్.. స్పిన్నర్లను ఎదుర్కొనే సమయంలో హెల్మెట్ వాడే విషయంలో మినహాయింపు ఉంది. ఈ సందర్భంలో వారు సాధారణ క్యాప్తోనూ బ్యాటింగ్ చేయొచ్చు. కానీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (england cricket board twitter) మాత్రం ఇందుకోసం విభిన్న రూల్స్ పాటిస్తోంది.
ప్రస్తుతం భారత్-ఇంగ్లాండ్ (IndvsEng) మధ్య జరుగుతోన్న టెస్టు సిరీస్‌లో భాగంగా టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్..స్పిన్ బౌలింగ్‌లో తలకు క్యాప్ ధరించి బ్యాటింగ్ చేయడం చూస్తున్నాం. కానీ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ మాత్రం హెల్మెట్‌తోనే బ్యాటింగ్ చేస్తున్నారు. దీనిపై చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఇంగ్లీష్ జట్టు ఆటగాళ్లు ఇలా ఎందుకు చేస్తున్నారు? క్యాప్ ధరించొచ్చు కదా? అనే సందేహాలు ఉన్నాయి. తాజాగా ఓ ఇంగ్లీష్ స్పోర్ట్స్ జర్నలిస్టు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
"బ్యాటింగ్ చేసే సమయంలో కోహ్లీసేన కొన్ని సమయాల్లో క్యాప్‌ను ధరిస్తే ఇంగ్లాండ్ క్రికెటర్లు హెల్మెట్‌తోనే బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. ఎందుకు?" అన్న ప్రశ్నకు ఎలిజిబెత్ అమ్మన్ సమాధానం చెప్పారు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకు ఈ విషయంలో విభిన్న రూల్స్ ఉన్నాయని తెలిపారు. వారి నిబంధనల ప్రకారం అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ ఏదైనా బ్యాట్స్‌మెన్ కచ్చితంగా హెల్మెట్ ధరించాలని వెల్లడించారు. స్పిన్నర్లను ఎదుర్కొనే క్రమంలోనూ ఇదే నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు.
-
To answer the question why kohli can bat in a cap but England players aren’t allowed to….. the ecb head protection regs state that anyone playing professional or pathway cricket must wear a helmet to bat in. Even against a spinner.
— Elizabeth Ammon (@legsidelizzy) August 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">To answer the question why kohli can bat in a cap but England players aren’t allowed to….. the ecb head protection regs state that anyone playing professional or pathway cricket must wear a helmet to bat in. Even against a spinner.
— Elizabeth Ammon (@legsidelizzy) August 27, 2021To answer the question why kohli can bat in a cap but England players aren’t allowed to….. the ecb head protection regs state that anyone playing professional or pathway cricket must wear a helmet to bat in. Even against a spinner.
— Elizabeth Ammon (@legsidelizzy) August 27, 2021
ఈ నిబంధనను పలువురు సమర్థిస్తున్నారు. స్పిన్నర్లు బౌలింగ్ చేసే సమయంలోనూ బంతి స్పీడ్‌గా వచ్చి తలకు తగిలే ప్రమాదం ఉంటుందని వారు చెబుతున్నారు. అయితే ఈసీబీ మినహా మిగతా బోర్డులు మాత్రం ఈ విషయంలో ఆటగాళ్లకే స్వేచ్ఛను ఇస్తున్నాయి.