What is Yo Yo Test : ఆటగాళ్లు పూర్తిగా ఫిట్‌నెస్ సాధిస్తేనే మైదానంలో చురుగ్గా కదలగలరు. మరి వారు ఎంత ఫిట్‌గా ఉన్నారని తెలుసుకోవాలంటే ఓ పరీక్ష పెట్టాలి కదా..అలాంటిదే ఇప్పుడు ఇండియన్ క్రికెట్లో ట్రెండ్ అవుతున్న యో-యో టెస్టు. 2018లో మొదలైన ఈ టెస్టు మధ్యలో కాస్త విరామం తీసుకుంది. రానున్న ఆసియా కప్, వరల్డ్ కప్ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఈ టెస్టును బీసీసీఐ నిర్వహిస్తోంది. ఇంతకీ ఈ యోయో ఏంటంటే..
అంతర్జాతీయ క్రికెట్లో ఉండే కాంపిటిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో పోటీ పడాలంటే.. ఒక్క స్కిల్, ఫామ్ మాత్రం ఉంటే సరిపోదు. అక్కడి ప్లేయర్స్‌కు దీటుగా పోరాడాలంటే మంచి ఫిట్‌నెస్ కూడా ఉండాల్సిందే. ఇదే భారత క్రికెట్ జట్టును నడిపించే మేనేజ్మెంట్ ఉద్దేశం కూడా. అందుకే అయిదేళ్ల కిందట యోయో అనే ఓ ఫిట్‌నెస్ పరీక్షను ప్రవేశ పెట్టి.. ప్రతి ఆటగాడూ అందులో పాసవ్వడం తప్పనిసరి అన్నట్లు ఓ నిబంధన పెట్టారు.
Yo Yo Test Indian Team : ఒకప్పటి స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ శంకర్ బసునే ఈ టెస్ట్‌లను టీమ్ఇండియాకు పరిచయం చేసింది. అయితే భారత క్రికెట్లో అత్యున్నత ఫిట్‌నెస్ ప్రమాణాలను నెలకొల్పిన రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లి అప్పటి టీమ్‌ఇండియా కెప్టెన్‌గా ఉండటం వల్ల యోయోకు సులువుగానే ఓకే చెప్పేశారు.ఇక అప్పటి కోచ్ రవిశాస్త్రి కూడా ఈ నిర్ణయాన్ని ఫుల్‌గా సపోర్ట్ చేశారు. అలా 2018 నుంచి దాదాపు మూడేళ్ల పాటు ఈ టెస్టులు విజయవంతంగా జరిగింది.
యోయోలో పాసవ్వడం అనేది అనేది టీమ్‌ఇండియా ఆటగాళ్లకు తప్పనిసరి టాస్క్‌గా మారింది. అయితే అత్యుత్తమ ఫిట్‌నెస్ ఉంటే తప్ప యోయోను అధిగమించడం సాధ్యం కాదు. ఇక యువరాజ్ సింగ్, సురేశ్ రైనా లాంటి సీనియర్లే కాదు.. వాషింగ్టన్ సుందర్, పృథ్వీ షా లాంటి యంగ్ ప్లేయర్లు సైతం ఈ పరీక్షను అధిగమించలేక ఇబ్బంది పడిన సందర్భాలున్నాయి.
ఇక కోహ్లి కెప్టెన్‌గా ఉన్నంత కాలం ఈ పరీక్షను కఠినంగానే అమలు చేశారు. అయితే అతను ఒక్కో ఫార్మాట్లో కెప్టెన్సీకి దూరం కావడం, మరోవైపు కరోనా ప్రభావం వల్ల ఆటగాళ్ల ఫిట్‌నెస్ ప్రమాణాలు తగ్గాయి. దీంతో యోయో మీద పూర్తిగా దృష్టిపెట్టే పరిస్థితి కూడా లేకపోయింది. ఇక కెప్టెన్‌తో పాటు కోచింగ్ సిబ్బంది కూడా మారడం వల్ల ఈ టెస్టును పక్కన పెట్టేశారు.
Yo Yo Test Eligibility Points : తాజాగా మళ్లీ యోయోకు పూర్వ వైభవం సంతరించుకుంది. వన్డే ప్రపంచకప్ సమీపిస్తుండటం వల్ల ఆసియా కప్‌కు మందే జట్టు సభ్యులకు యోయో టెస్ట్ నిర్వహించాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకుంది. దీంతో ఈ విషయాన్ని ఇప్పుడు తప్పనిసరి చేశారు. గతంలో దీంట్లో పాస్ అవ్వలంటే ప్లేయర్స్.. 16.1 పాయింట్లను కచ్చితంగా సాధించాల్సిందే. అయితే ఇప్పుడు అది కాస్త 16.5కు పెరిగింది.
మరోవైపు ఇటీవలే నిర్వహించిన పరీక్షల్లో యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ 18.5 పాయింట్లు సాధించి టాప్ పొజిషన్ నిలిచినట్లు టాప్ పొజిషన్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక తనకు 17.2 పాయింట్లు వచ్చినట్లు స్వయంగా కోహ్లినే వెల్లడించాడు. దీంతో రోహిత్‌తో పాటు తన సేనలోని మిగతా ఆటగాళ్లందరూ ఈ ఎలిజిబిలిటీ మార్క్‌ను దాటారు.
యోయో టెస్ట్ ఎలా ఎలా జరుగుతుంది?
Yo Yo Test Criteria : ఈ యోయో టెస్టులను డెన్మార్క్‌కు చెందిన సాకర్ సైకాలజిస్ట్ జెన్స్ బాంగ్స్‌బో సృష్టించారు. సాకర్‌లో పాపులరైన ఈ టెస్ట్‌ను ఆ తర్వాత క్రికెట్లోకి తీసుకొచ్చారు. పరుగెత్తే వేగాన్ని పెంచుతూ ఆటగాళ్ల సహన శక్తిని అంచనా వేయడమే ఈ టెస్ట్ ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా బీప్.. బీప్‌కు మధ్య కొద్దిపాటి బ్రేక్‌కు సగటున గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కిలోమీటరు నుంచి మూడు కిలోమీటర్ల వరకు పరుగెత్తాల్సి ఉంటుంది. ఇక ఈ యోయో పరీక్షలో రెండు స్థాయిలుంటాయి.
How is Yo Yo Test Done : మొదటిది తక్కువ శ్రమ పడే ఆటగాళ్ల కోసం.. రెండోది ఎక్స్పర్ట్స్ కోసం. టెస్టుల్లో భాగంగా 20 మీటర్ల దూరంలో ఇటు అటు ఎండ్ పాయింట్స్ ఉంచుతారు. ఇక ఇందులో పాల్గొనే ప్లేయర్స్ వాటి మధ్య పరుగెత్తాల్సి ఉంటుంది. అలా ఒక్కో పరుగుకు మూడు బీప్‌లు ఉంటాయి. మొదటి బీప్ వచ్చినపుడు ప్లేయర్ పరుగు ఆరంభించాలి. ఇక రెండోసారి శబ్దం వచ్చే టైంకి ఆటగాడు అవతలి వైపున్న కోచ్‌ను చేరుకోవాలి. అయితే మూడో బీప్ సమయానికి ఆరంభ స్థానానికి చేరాల్సి ఉంటుంది.
అయితే రెండో బీప్ సమయానికి అవతలి వైపు వెళ్లలేకపోతే మూడో బీప్ సమయానికి లక్ష్యానికి చేరాల్సిందే. లేకుంటే తొలి హెచ్చరికను జారీ చేస్తారు. అలా మూడు హెచ్చరికలు అందుకుంటే.. ఆ ప్లేయర్ ఇక యోయో టెస్ట్‌లో ఫేయిల్ అయినట్లే. నిర్వాహకులు ప్రతి నిమిషానికీ బీప్ వచ్చే టైంను తగ్గిస్తూ వెళ్తారు. ఇక ఒక షటిల్ 40 మీటర్లు కాగా.. ఆటగాళ్లు పూర్తి చేసిన షటిళ్ల ఆధారంగా స్కోరును కూడా లెక్కిస్తారు. ఒక్కో షటిల్ మధ్య 5-10 సెకన్ల బ్రేక్ దొరుకుతుంది. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఈ టెస్ట్‌ను నిర్వహిస్తున్నందున బీప్‌ను ఎవరూ కంట్రోల్ చేయలేదు.
-
Here's the Rohit Sharma-led team for the upcoming #AsiaCup2023 🙌#TeamIndia pic.twitter.com/TdSyyChB0b
— BCCI (@BCCI) August 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Here's the Rohit Sharma-led team for the upcoming #AsiaCup2023 🙌#TeamIndia pic.twitter.com/TdSyyChB0b
— BCCI (@BCCI) August 21, 2023Here's the Rohit Sharma-led team for the upcoming #AsiaCup2023 🙌#TeamIndia pic.twitter.com/TdSyyChB0b
— BCCI (@BCCI) August 21, 2023
Virat Kohli Yo Yo Test : కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్!.. యో-యో టెస్ట్ స్కోర్ వల్లే!