ETV Bharat / sports

రైనా భార్యది బీటెక్.. మరి కోహ్లీ, రోహిత్ భార్యల చదువేంటి? - అంజలి సచిన్ చదువు

క్రికెట్​.. భారత్​లో ఆట మాత్రమే కాదు ఓ మతం. ఆటను ఎంతగా అభిమానిస్తారో, ఆటగాళ్లను అంతకుమించి ఆరాధిస్తారు. మ్యాచ్​ జరుగుతుంటే కోట్లాది మంది వారికి మద్దతుగా నిలుస్తారు. అలాగే క్రికెటర్లు, వారి వ్యక్తిగత జీవితం గురించి ఫ్యాన్స్ తెలుసుకోవాలనుకుంటారు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా టాప్ క్రికెటర్ల భార్యలు ఏం చదువుకున్నారో తెలుసుకుందాం.

kohli rohith
కోహ్లీ, రోహిత్
author img

By

Published : Jul 15, 2021, 9:02 AM IST

భారత్​లో క్రికెట్​కు ఏ క్రీడకు లేనంత ఆదరణ ఉంది. అందుకే బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా వెలుగొందుతోంది. టీమ్ఇండియా క్రికెటర్లకూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వారి గురించి తెలుసుకోవాలని చాలామంది ఫ్యాన్స్ భావిస్తుంటారు. క్రికెటర్లతో పాటు వారి భార్యలకూ ఎక్కువ క్రేజ్ ఉంటుంది. వారి ఫొటోలు, వీడియోలు అందుకే వైరల్​గా మారుతూ ఉంటాయి. ఈ క్రమంలో వారు ఏం చదువుకున్నారో తెలుసుకుందాం.

అనుష్క కోహ్లీ

Kohli ANushka
కోహ్లీ, అనూష్క

ప్రస్తుత టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ.. బాలీవుడ్​లో స్టార్​ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న అనుష్క ఆర్ట్స్​లో డిగ్రీ పూర్తి చేయగా.. ఎకనామిక్స్​లో మాస్టర్స్​ పట్టా పొందింది. ప్రస్తుతం వెబ్​సిరీస్​లకు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది.

సాక్షి ధోనీ

Dhoni sakshi
ధోనీ, సాక్షి

టీమ్​ఇండియా కెప్టెన్​గా జట్టుకు ఎన్నో రికార్డు విజయాలు అందించిన క్రికెటర్​ మహేంద్ర సింగ్​ ధోనీ. అతని భార్య సాక్షి.. హోటల్​ మేనేజ్​మెంట్ విద్యలో పట్టభద్రురాలు. ఆమె ఔరంగాబాద్​లోని హోటల్ మేనేజ్​మెంట్​ ఇనిస్టిట్యూట్​లో డిగ్రీ పూర్తి చేసింది. మహీని పెళ్లాడక ముందు కోల్​కతాలోని తాజ్​ బంగాల్​ హోటల్​లో ట్రైనీగా పనిచేసింది. వీరిద్దరికీ 2010 జులై 4న వివాహమైంది. వీరికి జీవా అనే కూతురుంది. ప్రస్తుతం ధోనీకి సంబంధించిన విషయాలను చూసుకుంటూ బిజీగా గడిపేస్తోంది సాక్షి.

రితికా రోహిత్

Rohit Ritika
రోహిత్, రితిక

భారత జట్టు ఓపెనర్​ రోహిత్ ​శర్మ భార్య రితికా సజ్దే. ఈమె డిగ్రీ పూర్తి చేసింది. అలాగే స్పోర్ట్స్​ మేనేజర్​గా పనిచేస్తోంది​. అంటే ఆటగాళ్లకు సూచనలు ఇవ్వడం, స్పోర్ట్స్​ ఈవెంట్లు, మ్యాచ్​లు నిర్వహిస్తూ ఉంటారు. క్రికెట్​తో పాటు పలు క్రీడలపై రితికకు మంచి అవగాహన ఉంది. వీరిద్దరికీ సమైరా అనే పాప ఉంది.

అంజలి సచిన్

Anjali Sachin
అంజలి, సచిన్

భారత క్రికెట్​ దిగ్గజం, మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందుల్కర్​ సతీమణి అంజలి. ఈమె శిశు వైద్యురాలు(పీడియాట్రిషియన్​). అయితే సచిన్​ను వివాహం చేసుకున్నాక కెరీర్​ను విడిచిపెట్టేసింది. సచిన్​, అంజలి మొదటిసారి కలుసుకున్న సమయంలో ఆమె మెడికల్ స్టూడెంట్. వీరిద్దరికీ సారా, అర్జున్​ అనే పిల్లలున్నారు. అర్జున్​ ఇప్పటికే జూనియర్​ క్రికెట్​లో ఆడుతున్నాడు.

ప్రియాంకా రైనా

Raina Priyanka
రైనా, ప్రియాంక

భారత లెఫ్ట్​హ్యాండ్​ బ్యాట్స్​మన్​ సురేశ్​ రైనా సతీమణి ప్రియాంకా చౌదరి. ఈమె బీటెక్ పట్టా పొందింది. యాక్సెంచర్, విప్రో లాంటి ప్రముఖ కంపెనీల్లో సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా పని చేసింది. చిన్ననాటి నుంచే వీరిద్దరూ స్నేహితులు కాగా.. కొన్నేళ్ల ప్రేమ తర్వాత 2015లో వివాహం చేసుకున్నారు. 2016, మే 14న వీరిద్దరికీ ఓ పాప జన్మించింది. ఆమె పేరు గ్రేసియా రైనా.

ఇవీ చూడండి: ఈ క్రికెటర్ల కవర్​ డ్రైవ్ అద్భుతహా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.