ETV Bharat / sports

ప్రేయసిని పెళ్లాడిన నికోలస్ పూరన్ - ipl crikceter nicolas pooran

వెస్టిండీస్​ బ్యాట్స్​మన్​ నికోలస్​ పూరన్(Nicholas Pooran)​ తన ప్రేయసి అలిస్సా మిగ్యుయెల్​ను వివాహం చేసుకున్నాడు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా అతడికి పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

nicolas
నికోలస్​
author img

By

Published : Jun 1, 2021, 2:10 PM IST

వెస్టిండీస్​ విధ్వంసకర బ్యాట్స్​మన్​ నికోలస్​ పూరన్(Nicholas Pooran)​ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి అలిస్సా మిగ్యుయెల్​ను వివాహం చేసుకున్నాడు. సోషల్​ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ తమ పెళ్లి ఫొటోను పోస్ట్​ చేశాడు. "దేవుడు నాకు ఎన్నో చేశాడు. నువ్వు(భార్య) నా జీవితంలో ఉండటం కంటే గొప్పది ఏదీ లేదు. మిస్టర్​ అండ్​ మిసెస్​ పూరన్​కు స్వాగతం" అంటూ వ్యాఖ్య రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా అనిల్​ కుంబ్లే, జాసన్​ హోల్డర్​, పొలార్డ్​ సహా పలువురు క్రికెటర్లు పూరన్​కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

పూరన్​.. ఐపీఎల్​లో పంజాబ్​ కింగ్స్​(Punjab Kings)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కెరీర్​లో ఇప్పటివరకు 28వన్డేలు(982 పరుగులు), 27 టీ20లు(392), 28 ఐపీఎల్​ మ్యాచ్​లు(549) ఆడాడు. దేశంలో కరోనా రెండోదశ వేగంగా వ్యాపిస్తున్న వేళ తన వంతుగా.. ఈ మెగాలీగ్​లో(IPL) ఆడిన మ్యాచ్​ల ద్వారా వచ్చిన జీతంలో కొంతభాగాన్ని విరాళంగా ఇచ్చాడు.

  • Jesus has blessed me with many things in this life. None greater than having you in my life.
    Welcoming Mr. and Mrs. Pooran ❤️ pic.twitter.com/dDzSX8zdSA

    — NickyP (@nicholas_47) June 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: కరోనా బాధితుల కోసం ఐపీఎల్ జీతమిచ్చేసిన క్రికెటర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.