ETV Bharat / sports

కోహ్లీ సెంచరీలను ప్రశంసిస్తూ వార్నర్ పోస్ట్ - క్రికెట్ న్యూస్

అంతర్జాతీయ కెరీర్​లో 70 శతకాలతో ఉన్న కోహ్లీపై పొగడ్తలు కురిపించాడు ఆసీస్ క్రికెటర్ వార్నర్. అతడిని అందుకోవడం తమకు చాలా కష్టమని పేర్కొన్నాడు.

"we ain't catching Virat Kohli", David Warner on kohli centuries
కోహ్లీ వార్నర్
author img

By

Published : May 23, 2021, 1:11 PM IST

ప్రస్తుత తరం క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఘనతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరుగుల్లో, సెంచరీల్లో ఎన్నో రికార్డులు తనపేరిట నమోదు చేశాడు. ప్రస్తుతం అంతర్జాతీయ కెరీర్​లో 70 సెంచరీలతో ఉన్నాడు. ఈ విషయాన్నే గుర్తుచేస్తూ ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇన్​స్టా స్టోరీస్​లో పోస్ట్ పెట్టాడు. 'మేం కోహ్లీని అందుకోలేకపోతున్నాం అనేది నిజం' అని రాసుకొచ్చాడు.

ప్రస్తుతమున్న క్రికెటర్లలో ఎక్కువ సెంచరీలు చేసిన వారిలో కోహ్లీ తర్వాత వార్నర్(43) ఉన్నాడు. వీరిద్దరి మధ్య అంతరం 27 శతకాలు. కాబట్టి వార్నర్​ చెప్పినట్లు ఇప్పట్లో కోహ్లీని చేరుకోవడం, అధిగమించడం గానీ అతడి సహచర ఆటగాళ్లకు చాలా కష్టం.

warner insta story
వార్నర్ ఇన్​స్టా స్టోరీ

త్వరలో ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లనున్న కోహ్లీ ఆ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్​ ఆడనున్నాడు. అంతకంటే ముందు ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లోనూ పాల్గొన్నాడు. దాదాపు రెండేళ్లుగా సెంచరీ చేయలేకపోతున్న విరాట్.. ఈ పర్యటనతో తన శతకాల సంఖ్యను పెంచుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇది చదవండి: 'తర్వాతి మ్యాచ్​లో​ కోహ్లీ సెంచరీ పక్కా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.