Watson on Pant: దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌పై ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కోచింగ్‌లో పంత్ మరింత రాటుదేలుతాడని పేర్కొన్నాడు. చాలా చిన్న వయసులోనే ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడని చెప్పుకొచ్చాడు.
Delhi capitals pant Ponting
'రిషబ్ పంత్‌లోని నైపుణ్యం కారణంగానే అతడు నాయకుడిగా రాణించగలగుతున్నాడు. కేవలం 24 ఏళ్ల వయసులోనే ఎన్నో అపురూప ఘనతలు సాధించాడు. తనలోని లోపాలను అధిగమిస్తూ.. రోజు రోజుకీ మరింత మెరుగవుతున్నాడు. దిగ్గజ ఆటగాళ్లలో ఒకరైన రికీ పాంటింగ్ కోచింగ్‌లో పంత్ మరింత రాటుదేలుతాడు. పాంటింగ్‌లో జట్టుని సమర్థంగా నడిపించగల సామర్థ్యం, అందుబాటులో ఉన్న ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టగల నేర్పు ఉన్నాయి. రిషభ్‌కు కచ్చితంగా ఈ లక్షణం అలవడిందనుకుంటున్నాను. అయితే, దిల్లీ జట్టులో ఓ ఆటగాడిగా, కెప్టెన్‌గా పంత్ మెరుగ్గా రాణించడం అన్నింటి కంటే చాలా ముఖ్యం' అని షేన్ వాట్సన్ అన్నాడు.
Ponting Pant news
'ఆటగాళ్లను ఒకరితో మరొకరిని పోల్చడం సరికాదు. ప్రతిఒక్క ఆటగాడిలో ప్రత్యేక నైపుణ్యాలు, సొంత సామర్థ్యాలు ఉంటాయి. ధోని, రిషభ్ పంత్ ఇద్దరూ భిన్నమైన వ్యక్తులు. ఇద్దరిలోనూ విభిన్న సామర్థ్యాలున్నాయి. కానీ, ధోనీలాగే రిషబ్ పంత్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటాడు' అని వాట్సన్ చెప్పాడు.
వారితో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నా..
టీమ్‌ఇండియా యువ ఆటగాళ్లు పృథ్వీ షా, శార్దూల్ ఠాకూర్, రిషభ్ పంత్‌లతో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నానని షేన్ వాట్సన్ అన్నాడు. 'మా జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ గురించి తెలుసుకోవాలి. అతడు మెరుగ్గా రాణించేందుకు నా వంతు సహకారం అందిస్తాను. అలాగే, పృథ్వీ షాలో గొప్ప నైపుణ్యం ఉంది. అతడు బ్యాటింగ్ చేసే విధానం అద్భుతంగా ఉంటుంది. మరో ఆటగాడు శార్దూల్ ఠాకూర్‌తో ఇంతకు ముందే పరిచయం ఉంది. మేమిద్దరం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు తరఫున ఆడాం. ఇటీవల అతడు చాలా మెరుగ్గా రాణిస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ అత్యుత్తమ ఆల్ రౌండర్ స్థాయికి ఎదిగాడు. యువ ఆటగాళ్లతో మా జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. ఈ సీజన్‌లో కచ్చితంగా టైటిల్ సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని వాట్సన్ అభిప్రాయపడ్డాడు.
ఇదీ చదవండి: