లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్-ఇంగ్లాండ్ ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఐదో రోజు(సోమవారం) ఆటలోనూ ఇంగ్లీష్ జట్టు ఆటగాళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. నాలుగో రోజు ఆటలో సారథి కోహ్లీ-అండర్సన్ మధ్య వాగ్వివాదం జరగగా సోమవారం జరుగుతున్న ఆటలో బుమ్రా-బట్లర్ మధ్య వివాదం నెలకొంది.
ఐదో రోజు ఆటలో బుమ్రా, షమీ ఇంగ్లాండ్ బౌలర్ల సహనానికి పరీక్షపెట్టారు. ఈ క్రమంలోనే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బుమ్రాను బౌలర్ మార్క్ వుడ్ ఏదో అనగా.. తిరిగి మన పేస్ గుర్రం కూడా గట్టిగానే సమాధానమిచ్చాడు. ఇంతలో బట్లర్ కల్పించుకుని బుమ్రాను మరింత రెచ్చగొట్టాడు. ఈలోగా అంపైర్ వచ్చి గొడవను సద్దుమణిగేలా చేశాడు. ఆ తర్వాత మార్క్ వుడ్ వేసిన తర్వాత ఓవర్ తొలి బంతికే బుమ్రా బౌండరీ బాది మరోసారి దీటుగా బదులిచ్చాడు.
-
Heat is on, Bumrah 🥁🥵💥. #ENGvIND pic.twitter.com/ImuEAHiHAG
— Jon | Michael | Tyrion 🌊🌊 (@tyrion_jon) August 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Heat is on, Bumrah 🥁🥵💥. #ENGvIND pic.twitter.com/ImuEAHiHAG
— Jon | Michael | Tyrion 🌊🌊 (@tyrion_jon) August 16, 2021Heat is on, Bumrah 🥁🥵💥. #ENGvIND pic.twitter.com/ImuEAHiHAG
— Jon | Michael | Tyrion 🌊🌊 (@tyrion_jon) August 16, 2021
ఈ గొడవను బాల్కానీ నుంచి చూస్తున్న కోహ్లీ అసహనానికి గురయ్యాడు. చాలా కోపంతో కనిపించాడు. ఆ తర్వాత బుమ్రా బౌండరీ బాదడంపై హర్షం వ్యక్తం చేస్తూ కనిపించాడు. మొత్తంగా బుమ్రా.. షమీ కలిపి తొమ్మిదో వికెట్‌కు 97 పరుగులు చేశారు.
గ్రాండ్ వెల్కమ్
209 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను అద్భుత పోరాటంతో ఆదుకున్నారు షమీ, బుమ్రా. తొమ్మిదో వికెట్‌కు 97పరుగులు జోడించి టీమ్ఇండియాను పటిష్ఠ స్థితికి చేర్చారు. దీంతో లంచ్ విరామ సమయంలో వీరిద్దరికీ డ్రెస్సింగ్ రూమ్‌లో సహచర క్రికెటర్లు ఘనస్వాగతం పలికారు. ఈలలు, చప్పట్లతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
-
A partnership to remember for ages for @Jaspritbumrah93 & @MdShami11 on the field and a rousing welcome back to the dressing room from #TeamIndia.
— BCCI (@BCCI) August 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
What a moment this at Lord's 👏👏👏#ENGvIND pic.twitter.com/biRa32CDTt
">A partnership to remember for ages for @Jaspritbumrah93 & @MdShami11 on the field and a rousing welcome back to the dressing room from #TeamIndia.
— BCCI (@BCCI) August 16, 2021
What a moment this at Lord's 👏👏👏#ENGvIND pic.twitter.com/biRa32CDTtA partnership to remember for ages for @Jaspritbumrah93 & @MdShami11 on the field and a rousing welcome back to the dressing room from #TeamIndia.
— BCCI (@BCCI) August 16, 2021
What a moment this at Lord's 👏👏👏#ENGvIND pic.twitter.com/biRa32CDTt
ఇదీ చూడండి: INDvsENG: భారత్ 298/8 డిక్లేర్డ్.. ఇంగ్లాండ్ లక్ష్యం 272