ETV Bharat / sports

హమ్మయ్య.. ఇళ్లకు చేరుకున్నాం! - australia players reached home

ఐపీఎల్​లో​ పాల్గొన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్​ను పూర్తి చేసుకుని సోమవారం తమ ఇళ్లకు చేరుకున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత తమ కుటుంబాల్ని కలుసుకున్న ఆనందంలో భావోద్వేగానికి గురయ్యారు.

Aus ప్లేయర్స్
Aus ప్లేయర్స్
author img

By

Published : May 31, 2021, 1:43 PM IST

ఎట్టకేలకు ఐపీఎల్​(IPL 2021)లో పాల్గొన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు, కామెంటేటర్లు, సహాయక సిబ్బందికి విముక్తి లభించింది. దాదాపు రెండు నెలల తర్వాత సోమవారం తమ ఇళ్లకు చేరుకున్నారు. తమ కుటుంబసభ్యులను కలిసి ఆనందంలో మునిగితేలారు. ఆ సంతోషాన్ని పలు ఆసీస్​ క్రికెటర్లు సోషల్​మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

సన్​రైజర్స్ బ్యాట్స్​మన్​ వార్నర్(David Warner)​ ఇంటికి చేరుకోగానే తన కూతుర్లను హత్తుకుని ఎంతో ఆనందించాడు. దానికి సంబంధించిన వీడియోను సోషల్​మీడియాలో పంచుకున్నాడు. "ఇంటికి రావడం సంతోషంగా ఉంది. ఒక చోట ఇరుక్కుపోవడం ఎప్పుడైనా కష్టంగానే ఉంటుంది" అని పేస్​ బౌలర్​ జాసన్​ బెహ్రండార్ఫ్​ అన్నాడు. వీరితోపాటు స్టీవ్​ స్మిత్​(Steve Smith), పాట్​ కమిన్స్(Cummins)​, గ్లెన్​ మాక్స్​వెల్(Glenn Maxwell)​, జే రిచర్డ్​సన్ ఇంకా పలువురు ఆటగాళ్లు వారి ఇళ్లకు చేరుకున్నారు.

కరోనా వల్ల ఐపీఎల్​ మధ్యలోనే మే 4వ తేదీన నిలిచిపోవడం వల్ల ఈ మెగాలీగ్​లో పాల్గొన్న విదేశీ ఆటగాళ్లు ప్రత్యేక విమానాల ద్వారా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. కానీ.. భారత్​ నుంచి వచ్చే విమాన సర్వీసులను ఆస్ట్రేలియా ప్రభుత్వం మే 15వరకు నిలిపివేయడం వల్ల ఆసీస్​ ఆటగాళ్లు సొంత గూటికి చేరుకోలేకపోయారు. దీంతో చార్టెడ్​ విమానాల ద్వారా మాల్దీవులకు చేరుకుని అక్కడే మే 15వరకు సేదతీరారు. అనంతరం స్వదేశానికి చేరుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్వారంటైన్​లో 14రోజులు ఉండి సోమవారం తమ ఇళ్లకు వెళ్లారు. ఐపీఎల్​లో పాల్గొన్న కేన్​ రిచర్డ్​సన్(Kane Richardson), ఆడం జంపా(Adam Zampa) సహా ఇంకొంతమంది మాత్రం మెగాటోర్నీ​ వాయిదా, విమాన సేవలు రద్దు కాకముందే ఇక్కడి నుంచి వెళ్లిపోయారు.

వాయిదా పడిన ఈ ఐపీఎల్ సీజన్​ రెండో దశను సెప్టెంబరులో యూఏఈ వేదికగా నిర్వహించనున్నట్లు ఇటీవల బీసీసీఐ(BCCI) ప్రకటించింది.

  • Video of the day! After eight weeks away for the IPL, Pat Cummins finally leaves hotel quarantine and reunites with his pregnant partner Becky. All the feels! pic.twitter.com/YA3j98zJId

    — Chloe-Amanda Bailey (@ChloeAmandaB) May 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: Kohli: ధోనీ గురించి కోహ్లీ రెండు మాటల్లో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.