ETV Bharat / sports

తలైవాగా మారిన వార్నర్.. వీడియో వైరల్! - వార్నర్​ టిక్​టాక్​ వీడియోస్​

ఏ మాత్రం తీరిక సమయం దొరికినా నెట్టింట సందడి చేసే ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్​మన్​ డేవిడ్ వార్నర్.. మరో కొత్త వీడియోను పోస్టు చేశాడు. ఈ సారి సూపర్​స్టార్​ రజనీకాంత్​ నటించిన 'రోబో' సినిమాలోని పాటతో అలరించాడు. వైరల్​గా మారిన ఆ వీడియోను మీరూ చూసేయండి..

warner
వార్నర్​
author img

By

Published : Aug 27, 2021, 9:56 PM IST

ఆస్ట్రేలియా​ స్టార్​ క్రికెటర్ డేవిడ్​ వార్నర్​ గతేడాది లాక్​డౌన్​ ప్రకటించినప్పటి నుంచి టిక్​టాక్​, రీఫేస్​ యాప్​ల ద్వారా అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. తెలుగు, తమిళం, హిందీ అనే తేడా లేకుండా ఎప్పటికప్పుడు వీడియోలతో ఎంటర్​టైన్​ చేస్తూ భారతీయ అభిమానులకు ఎంతో చేరువయ్యాడు. అయితే ఈ సారి సూపర్​స్టార్​ రజనీకాంత్​లా మారిపోయాడు. తలైవా​ నటించిన 'ఎంతిరన్'​(తెలుగులో రోబో) సినిమాలోని 'కిలిమంజారో' పాటకు రీఫేస్​ యాప్​ ద్వారా ప్రేక్షకుల్ని పలకరించాడు. ఈ వీడియోను ఇన్​స్టాలో పోస్ట్​ చేయగా వైరల్​గా మారింది. అభిమానులను విశేషంగా అలరిస్తోంది. నెటిజన్లు విపరీతంగా లైక్స్​, కామెంట్స్​ పెడుతున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి..

వార్నర్​.. దుబాయ్​ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్​ రెండో దశలో ఆడనున్నాడు. మొదటి దశలో ఆడిన ఏడు మ్యాచ్​ల్లో ఆరింటిలో ఓడిపోయింది సన్​రైజర్స్​. వరుస పరాజయాల నేపథ్యంలో వార్నర్​ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ​ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కనీసం తుది జట్టులోనూ చోటు ఇవ్వలేదు. కేన్​ విలియమ్సన్​కు సారథ్య బాధ్యతలు అప్పగించింది.

ఇదీ చూడండి:'రాములో రాములా' అంటూ వార్నర్ చిందులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.