Virat Kohli Success Mantra : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మెగాటోర్నీలో దూసుకుపోతున్నాడు. ఒక్కో మ్యాచ్‌లో తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఇక ఛేజింగ్ అంటే విరాట్ ఎలా చెలరేగిపోతాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ స్థాయికి చేరేందుకు రెగ్యులర్‌గా నెట్స్‌లో శ్రమిస్తానని విరాట్ ఎప్పుడూ చెబుతుంటాడు. అయితే రీసెంట్గా ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్‌స్పోర్ట్స్‌తో చిట్‌చాట్ చేశాడు. ఈ చిట్‌చాట్‌లో తను నమ్మకంతో ఆచరించే నినాదం ఒకటుందని అన్నాడు.
అత్యున్నత స్థాయికి చేరుకున్నాని ఎప్పుడూ భావించనని.. స్కిల్స్ డెవలప్ చేసుకునేందుకు రోజూ కష్టపడతానని విరాట్ అన్నాడు. " వ్యక్తిగతంగా, సామర్థ్యపరంగా మరింత మెరుగ్గయ్యేందుకు ఎప్పటికప్పుడు శ్రమిస్తా. నిరంతరం అందుకోసం సాధన చేస్తుంటా. నిలకడగా ఆడేందుకు ఇదే నాకు సహాయపడింది. అత్యుత్తమ స్థాయి అనేది ఎక్కడా ఉండదని.. దానికి హద్దు లేదని భావిస్తా. లేకపోతే ఓ స్టేజ్‌కు వచ్చేసరికి ఆగిపోవాల్సి ఉంటుంది. ఇక ఎక్స్‌లెన్స్ అనే పదాన్ని నేను పట్టించుకోను. దానికంటూ ఓ నిర్వచనం కూడా లేదనేది నా ఫీలింగ్. అందుకే స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలనే దానిపైనే దృష్టి సారిస్తుంటా. పెర్ఫార్మెన్స్ అనేది బై ప్రొడక్ట్. ఎప్పుడూ జట్టును ఎలా గెలిపించాలనే ఆలోచనతో ఉండాలి" అని విరాట్ అన్నాడు.
వరల్డ్‌కప్‌లో అసాధారణం.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన విరాట్ ఇప్పటికే 118 సగటుతో 354 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదే టోర్నీలో భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ విఫలమైనా.. విరాట్ అద్భుత పోరాటంతో టీమ్ఇండియాను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ 85 పరుగులు సాధించాడు. ఇక గత మ్యాచ్ న్యూజిలాండ్‌తో కూడా విరాట్.. ఆఖరి వరకు క్రీజులో ఉన్నాడు. 95 పరుగులు వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. ఇక వన్డే కెరీర్లో 286 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 13437 పరుగులు చేశాడు. ఇందులో 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంకొక్క శతకం సాధిస్తే.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ సరసన చేరతాడు.
-
𝙃𝙐𝙉𝘿𝙍𝙀𝘿!
— BCCI (@BCCI) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Number 4⃣8⃣ in ODIs
Number 7⃣8⃣ in international cricket
Take a bow King Kohli 👑🙌#CWC23 | #TeamIndia | #INDvBAN | #MenInBlue pic.twitter.com/YN8XOrdETH
">𝙃𝙐𝙉𝘿𝙍𝙀𝘿!
— BCCI (@BCCI) October 19, 2023
Number 4⃣8⃣ in ODIs
Number 7⃣8⃣ in international cricket
Take a bow King Kohli 👑🙌#CWC23 | #TeamIndia | #INDvBAN | #MenInBlue pic.twitter.com/YN8XOrdETH𝙃𝙐𝙉𝘿𝙍𝙀𝘿!
— BCCI (@BCCI) October 19, 2023
Number 4⃣8⃣ in ODIs
Number 7⃣8⃣ in international cricket
Take a bow King Kohli 👑🙌#CWC23 | #TeamIndia | #INDvBAN | #MenInBlue pic.twitter.com/YN8XOrdETH
Virat Kohli Centuries : జస్ట్ మిస్.. కోహ్లీ సెంచరీలు చేజార్చుకున్న సందర్భాలు ఎన్నో తెలుసా?
KL Rahul World Cup 2023 : 'విరాట్ వద్దనుకున్నాడు.. కానీ నేనే అతడికి అలా చెప్పాను'