ఫిబ్రవరి 9న భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో చాలా మంది క్రికెట్ అభిమానుల మదిలో ఓ విషయం మెదులుతోంది. టీమ్ఇండియా ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నారు. అదేంటంటే.. 2020లో భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గావస్కర్ సిరీస్ జరిగింది. అయితే సిరీస్ మొత్తంలో ఓ పింక్ బాల్ టెస్టు(డే అండ్ నైట్ టెస్ట్) ఆడాలని అనుకునేవారు.
అలా మొదట్లోనే పింక్ బాల్ టెస్టు ఆడారు. మొదటి ఇన్నింగ్స్‌లో.. తొలుత బ్యాంటింగ్ చేసిన భారత్ 244 పరుగులు చేసి.. ఆసీస్‌ను 191 పరుగులకే ఆల్ ఔట్ చేశారు. దీంతో అందరూ భారత్ విజయం సాధిస్తుందని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 36 పరుగులకే చేతులెత్తేసి ఆల్ ఔట్ అయింది. అయితే, ఆ సిరీస్‌ను 2-1తో టీమ్ఇండియా గెలుచుకుంది. కానీ, ఆ 36 పరుగుల ఓటమి మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ పరాభవానికి ఇప్పుడు ప్రతీకారం తీసుకోలని అనుకుంటున్నారు టీమ్ఇండియా ప్లేయర్లు. ఇక, రోహిత్ సేన ఎలాంటి రివేంజ్ తీర్చుకుంటుందో వేచి చూడాలి.
ఎగతాళి చేయడమంటే కోహ్లీకి ఇష్టమట..
కంగారూలతో ఆడటమంటే కోహ్లీకి చాలా ఇష్టమట. ఆస్ట్రేలియా జట్టు ప్లేయర్లను ఎగతాళి చేయాడనికి విరాట్ ఇష్టపడతాడట. ఈ మేరకు టీమ్ఇండియా మాజీ బ్యాంటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు బంగర్ మాట్లాడుతూ.."ఆసీస్‌తో ఆడటానికి, ఆ టీమ్ ప్లేయర్లను ఎగతాళి చేయడానికి విరాట్ కోహ్లీ ఇష్టపడతాడు. కోహ్లీ తన ఆటను మెరుగుపర్చుకుంటాడు. టెస్టు క్రికెట్ విరాట్ కోహ్లీ నుంచి ఉత్తమ ప్రదర్శనను అందించే ఫార్మాట్".
"గత రెండున్నరేళ్లుగా అతడు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. వన్డేలు, టీ20ల్లో ఆస్వాదించిన ఫామ్‌ను కొనసాగించాలని అకుంటున్నాడు. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌పై దృష్టి పెట్టాలని భావిస్తున్నాడు. కాబట్టి, విరాట్ న మంచి ఆటతీరును కనబర్చి.. ఈ సిరీస్‌పై ప్రభావం చూపుతాడు. టెస్టు ఫార్మాట్లో ఎదురయ్యే ఛాలెంజెస్ను విరాట్ సులువుగా అధిగమిస్తాడని మేము చాలా ఆశిస్తున్నాము" అని చెప్పుకొచ్చారు. కాగా, భారత్, ఆసీస్ మధ్య ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో మొదటి మ్యాచ్ నాగ్‌పుర్ వేదికగా జరగనుంది.