ETV Bharat / sports

వైరల్​గా కోహ్లీ పోస్ట్​​.. అతడి నిర్ణయం ఏంటో? - ఇండియా ఆస్ట్రేలియా టెస్టు సిరీస్​ ప్రారంభ తేది

న్యూజిలాండ్​తో జరిగిన టీ20 సిరీస్​కు బ్రేక్​ తీసుకున్న విరాట్​ కోహ్లీ.. పర్సనల్​ లైఫ్​ను ఎంజాయ్​ చేస్తున్నాడు. ఈ సందర్భంగా రకరకాల ప్రదేశాలకు వెళ్తూ.. ఆ ఫొటోలను ఫ్యాన్స్​తో షేర్​ చేసుకుంటున్నాడు. అయితే తాజాగా, కోహ్లీ ఓ పెట్టిన పోస్ట్​ వల్ల ఫ్యాన్స్​ మదిలో పలు ఆలోచనలు మెదులుతున్నాయి. ఆ వివరాలు..

virat kohli instagram story
virat kohli instagram story
author img

By

Published : Feb 2, 2023, 3:55 PM IST

టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ న్యూజిలాండ్​తో జరిగిన టీ20 సిరీస్​కు విరామం తీసుకున్నాడు. వరుస టూర్​లతో సరదాగా గడుపుతూ పర్సనల్​ లైఫ్​ను ఎంజాయ్​ చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇటీవల రిషికేశ్​లోని ' వృందావన్​' ఆశ్రమానికి తన భార్య అనుష్కశర్మతో కలిసి వెళ్లాడు. అనంతరం కొండలపై సరదాగా ట్రెక్కింగ్​ చేశాడు. ఆ ఫొటోలను పంచుకున్నాడు విరాట్​. ఈ సందర్భంగా సోషల్​ మీడియాలో కోహ్లీ పెట్టిన పోస్టు వైరల్​గా మారింది.

'నీ మనసుకు ఎటు వెళ్లాలో తెలుసు. ఆ దిశలోనే పరుగెత్తు' అంటూ ఇన్​స్టాగ్రామ్​లో స్టోరీ పెట్టాడు. ఈ స్టోరీని చాలా మంది సోషల్​మీడియాలో షేర్​ చేశారు. దీంతో కోహ్లీపై చర్చ మొదలైంది. విశ్రాంతి తీసుకున్న సమయంలో జరిగిన విషయాల గురించి విరాట్​ చెబుతున్నాడని కొంత మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు తన భవిష్యత్​ గురించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాడని అంటున్నారు. కాగా, విరాట్​ కోహ్లీ,​ వచ్చేవారంలో ఆసీస్​తో జరగబోయే టెస్టు సిరీస్​కు అందుబాటులో ఉంటాడు. ప్రస్తుతం కోహ్లీ మంచి ఫామ్​ను కొనసాగిస్తున్నాడు. ఇక ఆసీస్​పై కూడా విరాట్​కు మంచి రికార్డు ఉంది. ఈ టెస్టు సిరీస్​ ఫిబ్రవరి 9 నుంచి సిరీస్​ మొదలవుతుంది.

virat kohli instagram story
విరాట్​ కోహ్లీ పెట్టిన ఇన్​స్టా స్టోరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.