ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ముంగిట టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. భారత్-కౌంటీ సెలెక్ట్ ఎలెవన్ మధ్య వార్మప్ మ్యాచ్ సందర్భంగా భోజన విరామ సమయంలో అతడు నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు.
నడుం నొప్పి కారణంగా ప్రాక్టీస్ మ్యాచ్‌కు దూరమైన కోహ్లీ.. నెట్స్‌లో అంత అసౌకర్యంగా ఏమీ కనిపించలేదు. దీన్ని బట్టి అతనికి పెద్ద గాయమేమీ కాలేదని అర్థమవుతోంది. ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న తొలి టెస్టు నాటికి విరాట్ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధిస్తాడని తెలుస్తోంది.
-
Hi @imVkohli! 👋
— Durham Cricket (@DurhamCricket) July 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
A lunch time net session for the @BCCI captain at Emirates Riverside. 🇮🇳
Live stream ➡️https://t.co/vxbhwkBUGh pic.twitter.com/6puTlr7zO4
">Hi @imVkohli! 👋
— Durham Cricket (@DurhamCricket) July 21, 2021
A lunch time net session for the @BCCI captain at Emirates Riverside. 🇮🇳
Live stream ➡️https://t.co/vxbhwkBUGh pic.twitter.com/6puTlr7zO4Hi @imVkohli! 👋
— Durham Cricket (@DurhamCricket) July 21, 2021
A lunch time net session for the @BCCI captain at Emirates Riverside. 🇮🇳
Live stream ➡️https://t.co/vxbhwkBUGh pic.twitter.com/6puTlr7zO4
కోహ్లీ గైర్హాజరుతో టీమ్ఇండియాను రోహిత్ శర్మ ముందుండి నడిపిస్తున్నాడు. కౌంటీ ఎలెవన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 311 పరుగులకు ఆలౌటైంది.
తొలి టెస్టుకు దాదాపు మరో రెండు వారాల సమయం ఉండగానే ఆతిథ్య ఇంగ్లాండ్.. తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించింది. ఒల్లీ రాబిన్సన్, బెన్ స్టోక్స్ వంటి ఆల్రౌండర్లకు టీమ్‌లో స్థానం కల్పించింది. మోచేతి గాయంతో ఆటకు దూరమైన జోఫ్రా ఆర్చర్‌ను ఈ సిరీస్‌కు కూడా పక్కన పెట్టింది ఇంగ్లాండ్ బోర్డు.
ఇదీ చదవండి: ICC Rankings: మెరుగైన ధావన్, చాహల్ స్థానాలు