ETV Bharat / sports

'డబ్ల్యూటీసీ' ఆడితే కోహ్లీ కొత్త రికార్డ్​ - ఐసీసీ

టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నాడు. కొద్ది రోజుల్లో జరగబోయే టెస్ట్​ ఛాంపియన్​ షిప్​ మ్యాచ్​ ఆడితే.. 2008 నుంచి ఇప్పటి వరకు భారత్ ఆడిన అన్ని ఐసీసీ ఫైనల్స్​లోనూ పాల్గొన్న ఏకైక, మొదటి ఆటగాడిగా విరాట్ కొత్త ఫీట్ సాధించనున్నాడు.

virat kohli, team india captain
విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్
author img

By

Published : May 21, 2021, 7:17 PM IST

రికార్డుల రారాజు, టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకోనున్నాడు. ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​ షిప్​ మ్యాచ్​ ఆడితే.. 2008 నుంచి ఇప్పటి వరకు భారత్​ ఆడిన అన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఫైనల్స్​లో ఆడిన ఏకైక, మొదటి ఆటగాడిగా సరికొత్త ఫీట్ సాధించనున్నాడు విరాట్.

  • 2008లో జరిగిన అండర్​-19 ప్రపంచకప్​ ఫైనల్లో విరాట్ సారథ్యంలోని జట్టు టైటిల్ కైవసం చేసుకుంది.
  • భారత్ వేదికగా 2011లో శ్రీలంకతో జరిగిన వరల్డ్​కప్ తుది పోరులోనూ కోహ్లీ ఆడాడు. ఈ మ్యాచ్​లో జయకేతనం ఎగురవేసిన ధోనీ సేన.. రెండో సారి ప్రపంచకప్​ను ముద్దాడింది.
  • 2014లో ఐసీసీ నిర్వహించిన టీ20 ప్రపంచకప్​ ఫైనల్లో టీమ్​ఇండియా 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్​లోనూ కోహ్లీ పాల్గొన్నాడు.
  • 2013, 2017 ఛాంపియన్స్​ ట్రోఫీ ఫైనల్లో విరాట్ టీమ్ఇండియాకు ఆడాడు.
  • ఇక వచ్చే నెల ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్లోనూ విరాట్ నేతృత్వంలోని భారత జట్టు కివీస్​తో తలపడబోతోంది. అన్ని అనుకూలిస్తే విరాట్ ఈ మ్యాచ్​లో ఆడడం పక్కా. దీంతో 2008 నుంచి ఐసీసీ ఫైనల్స్​లో భారత్​ పాల్గొన్న ప్రతిసారి టీమ్ఇండియాకు ఆడిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు అందుకోనున్నాడు.

ఇదీ చదవండి: 'ఐపీఎల్​ నుంచి నేనే వెళ్లిపోదామనుకున్నా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.