ETV Bharat / sports

Virat Kohli At No 4 : నాలుగో స్థానంలో విరాట్ వస్తాడా?​.. ఆ ప్లేస్​లో అతడి రికార్డులు ఎలా ఉన్నాయంటే?

Virat Kohli At No 4 : వన్డేల్లో టీమ్ఇండియా నాలుగో పొజిషన్​లో విరాట్​ను ఆడించాలని మాజీ కోచ్ రవిశాస్త్రి ఎప్పుడో అనుకున్నాడట. శాస్త్రి అలా అనుకోవడానికి ఓ కారణం ఉందన్నాడు. మరి అదేంటంటే..

Virat Kohli Batting Order
విరాట్ బ్యాటింగ్ పొజిషన్
author img

By

Published : Aug 17, 2023, 4:05 PM IST

Virat Kohli At No 4 : టీమ్ఇండియా వన్డేల్లో నాలుగో స్థానం కొన్ని రోజుల నుంచి చర్చనీయాంశంగా మారింది. గాయపడిన స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్.. ప్రపంచకప్​లోపు పూర్తి ఫిట్​నెస్​తో తిరిగి జట్టులోకి వస్తే.. ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అలా వారు రాకపోతే అది ప్రధాన సమస్యే అవుతుంది.

అందుకని జట్టు మేనేజ్​మెంట్ ఇప్పటికే పలువురిని నాలుగో స్థానంలో పరిశీలించింది. కాగా రీసెంట్​గా ఆ స్థానంలో కెప్టెన్ రోహిత్ శర్మ రావొచ్చని కొన్ని కథనాలు వచ్చాయి. కానీ ఆ స్థానంలో స్టార్ బ్యాటర్​ విరాట్ కోహ్లీని ఆడించాలని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి.. ఎప్పుడో భావించాడట. మరి రవిశాస్త్రి ఎందుకు అలా అనుకున్నాడంటే..

చాలా కాలం నుంచి వన్డేల్లో.. టీమ్ఇండియా టాపార్డర్​ పటిష్ఠంగా ఉంది. కానీ ఒకసారి జట్టు మొదటి మూడు వికెట్లు కోల్పోతే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో 2019 ప్రపంచకప్​ రెండో సెమీఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్​లో చూశామని శాస్త్రి అన్నాడు. ఆ మ్యాచ్​లో టీమ్ఇండియా 240 పరుగుల ఛేదనలో.. 5 పరుగులకే ఓపెనర్లు సహా, విరాట్ కూడా ఔటయ్యాడు. తర్వాత మంచి బ్యాటింగ్ లైనప్​ ఉన్నప్పటికీ.. భారత్ ఆ మ్యాచ్​లో 18 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

అయితే బ్యాటింగ్ లైనప్​ను బ్యాలెన్స్ చేయడానికి.. 2019 వరల్డ్ కప్ ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో విరాట్​ను నాలుగో స్థానంలో పంపాలని శాస్త్రి అనుకున్నాడట. అప్పుడు టాపార్డర్ విఫలమైనా.. మిడిల్​లో కోహ్లీ పరిస్థితిని చక్కబెడతడని భావించాడట. కానీ అప్పుడు అది కుదరలేదు. అయితే అదే టోర్నమెంట్ సెమీస్​లో భారత్​కు ఎదురైన పరాభవం శాస్త్రి భయాలను నిజం చేసిందట. అందుకే 34 ఏళ్ల విరాట్ సేవలు.. జట్టుకు అవసరమైతే నాలుగో స్థానంలో వాడుకోవాలని అభిప్రాయపడ్డాడు.

" టీమ్ఇండియాలో పొజిషన్ నెంబర్ 4 కోసం నేను ఆలోచించిన సందర్భాలు చాలా ఉన్నాయి. గతంలో నేను కోచ్​గా ఉన్న సమయంలో.. 2019 ప్రపంచ కప్​లో విరాట్​ను నాలుగో ప్లేస్​లో ఆడించడానికి చీఫ్ సెలెక్టర్ ఎమ్​ఎస్​కే ప్రసాద్​తో కూడా చర్చించాను. విరాట్ నాలుగో స్థానంలో ఆడితే మిడిల్ ఆర్డర్​ పటిష్ఠంగా మరవచ్చు" అని రవిశాస్తి అభిప్రాయపడ్డాడు.

విరాట్ నాలుగో స్థానంలో రికార్డులు.. విరాట్ వన్డేల్లో 42 మ్యాచ్​ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చాడు. ఈ స్థానంలో విరాట్ 55.21 సగటుతో 1767 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు ఉన్నాయి. ఇందులో విరాట్ ఫేమస్ ఇన్నింగ్స్ (86 బంతుల్లో 133*) 2012 శ్రీలంకపై నాలుగో స్థానంలో వచ్చి సాధించిందే. అలాగే అదే శ్రీలంకపై మళ్లీ.. నాలుగో స్థానంలోనే 2014 రాంచీలో139* పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత 2019, 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​ల్లో నెంబర్ 4లో బ్యాటింగ్​ చేశాడు విరాట్. కానీ ఈ రెండింట్లో 7, 16 పరుగులే చేసి ఔటయ్యాడు.

మరోవైపు జట్టు మేనేజ్​మెంట్ ఈ ప్లేస్​లో సంజు శాంసన్, సూర్య కుమార్, ఇషాన్ కిషన్​ను పరీక్షిస్తోంది. అలాగే అటు రాహుల్, శ్రేయస్​ కూడా కోలుకుంటున్న సమయంలో.. విరాట్ నాలుగులో బ్యాటింగ్ చేసే అవకాశం ఉందా? లేదా? అనేది కాలమే నిర్ణయిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.