ETV Bharat / sports

WTC final: టీమ్​ఇండియా గెలుపు వారే నిర్ణయిస్తారు!

ప్రపంచటెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో(World Test Championship) టీమ్​ఇండియా జాగ్రత్తగా ఆడాలని సూచించాడు దిగ్గజ క్రికెటర్​ కపిల్​దేవ్(kapilDev). భారత జట్టు గెలుపు ఓటమి మన బ్యాట్స్​మెన్​పైనే ఆధారపడి ఉందని చెప్పాడు. పంత్​ అక్కడి పరిస్థితికి అలవాటు పడిన తర్వాతే దూకుడు ప్రదర్శించాలని సూచించాడు.

teamindia
టీమ్​ఇండియా
author img

By

Published : May 30, 2021, 8:49 AM IST

Updated : May 30, 2021, 12:05 PM IST

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్​లో(Wold Test Championship) టీమ్‌ఇండియా ఆచితూచి ఆడాలని దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ అన్నాడు. నియంత్రిత దూకుడు మాత్రమే అవసరమని సూచించాడు. ఇంగ్లాండ్‌లో వాతావరణం నిమిషాల వ్యవధిలో మారుతుందన్నాడు. అందుకే ఒక్కో సెషన్‌ లక్ష్యంగా ముందుకు సాగాలని తెలిపాడు. వ్యూహాత్మకంగా, సాంకేతికంగా మెరుగ్గా ఆడాలని పేర్కొన్నాడు. రిషభ్ పంత్‌లో(rishab Pant) పరిణతి కనిపిస్తోందని వెల్లడించాడు.

"టీమ్‌ఇండియా(Team india) బ్యాటింగ్‌ విభాగం అద్భుతంగా ఉంది. పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారన్నదే కీలకం. నా వరకైతే కోహ్లీసేన బ్యాటింగే అతి ముఖ్యమైంది. ఈ మధ్య కాలంలో బౌలర్లు తిరుగులేని విధంగా ఆడుతున్నారు. అందుకే బ్యాట్స్‌మెన్‌ నాణ్యతను బట్టే ఫైనల్‌లో గెలుపోటములు ఉంటాయి. టెస్టు క్రికెట్‌ అంటేనే సెషన్లు. ఇంగ్లాండ్‌లో నిమిషాల్లోనే ఎండలు కాస్తున్న ఆకాశం మేఘావృతం అవుతుంది. అందుకే సాంకేతికంగా, వ్యూహాత్మకంగా బాగా ఆడాలి."

-కపిల్‌, టీమ్​ఇండియా మాజీ సారథి.

"కోహ్లీ(Kohli) రాణించాలని కోరుకుంటున్నా. సహజంగానే అతడు దేనికైనా అలవాటు పడతాడు. అతి దూకుడు మాత్రం వద్దంటాను. ఒక్కో సెషన్‌ను బట్టి అతడు వ్యూహాలు రచించాలి. ఆధిపత్యం కొనసాగించేందుకు అవకాశాల కోసం ఎదురు చూడాలి. ఓపికగా ఉంటే పరుగులు వస్తాయి. ఇంగ్లాండ్‌లో బంతి స్వింగ్‌ అవుతుంది. కాబట్టి ఆదిలోనే షాట్లు ఆడొద్దు. సహనంతోనే ఇంగ్లాండ్‌లో పరుగులు వస్తాయి. ఇక పంత్‌ క్రీజులో నిలదొక్కుకొని ముందుగా పరిస్థితులకు అలవాటు పడాలి. ఆ తర్వాతే దూకుడు ప్రదర్శించాలి. రెండు, మూడు మ్యాచ్‌లు ఉంటే ఫైనల్స్‌కు మరింత అర్థం ఉండేది. లార్డ్స్‌లో నిర్వహిస్తే బాగుండేది. ప్రస్తుత పరిస్థితుల్లో తప్పడం లేదు" అని కపిల్‌(kapil Dev) చెప్పాడు.

ఇదీ చూడండి: WTC Final: పంత్​ను హెచ్చరించిన కపిల్​దేవ్​

Last Updated : May 30, 2021, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.