న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా భారత జట్టులో అరంగేట్రం చేశాడు ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్(Venkatesh Iyer Team India). అయితే.. టీమ్ఇండియాలో మిడిలార్డర్ సమస్య ఉన్న నేపథ్యంలో.. ఏ స్థానంలో ఆడాలన్న అంశంపై తన అభిప్రాయాన్ని తెలిపాడు.
"భిన్నమైన స్థానాల్లో జట్టు కోసం ఆడటం చాలా మంచింది. ఆల్‌రౌండర్‌ను కాబట్టి అన్ని స్థానాల్లో ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో రాణించాలి. నేను జట్టుకు ఎంపిక అయ్యానంటే.. కచ్చితంగా చక్కటి ప్రదర్శన చేయడమే బాధ్యతగా భావిస్తా."
--వెంకటేష్ అయ్యర్, టీమ్ఇండియా ఆల్‌రౌండర్.
జట్టుకు అన్ని విధాలా సహకరించడమే ముఖ్యమని భావిస్తున్నట్లు అయ్యర్(Venkatesh Iyer All Rounder) పేర్కొన్నాడు. కెప్టెన్ బౌలింగ్ చేయమని అడిగితే.. వికెట్లు తీయడమే తన లక్ష్యమని, బ్యాటింగ్ చేయమంటే వీలైనన్ని పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు.
అయితే.. బ్యాటర్‌గా ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశాడు వెంకటేష్ అయ్యర్.
రిలాక్స్‌గా ఉంచుతారు..
టీమ్ఇండియా టీ20 సారథి రోహిత్ శర్మ(Rohit Captaincy), హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను(Rahul Dravid Coach) ప్రశంసించాడు వెంకటేష్ అయ్యర్. డ్రెస్సింగ్ రూమ్‌ను వాళ్లు రిలాక్స్డ్గా ఉంచుతారని తెలిపాడు. యువ ఆటగాళ్లను ఎలా డీల్ చేయాలో వారికి బాగా తెలుసని అన్నాడు. రాహుల్ ద్రవిడ్ తనను ఎంతో ప్రోత్సహించాడని చెప్పాడు.
ఇదీ చదవండి:
BCCI Halal Meat: భారత క్రికెటర్ల మెనూ వివాదంపై బీసీసీఐ స్పష్టత