ETV Bharat / sports

పెళ్లిపీటలెక్కనున్న టీమ్​ఇండియా ప్లేయర్ వెంకటేశ్​ అయ్యర్-​ ఎంగేజ్​మెంట్ ఫొటోలు చూశారా?

Venkatesh Iyer Engagement Photos : టీమ్ఇండియా ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నాడు. బెంగళూరులు చెందిన ఫ్యాషన్​ డిజైనర్​తో మంగళవారం అయ్యర్ నిశ్చితార్థం జరిగింది.

Venkatesh Iyer Engagement Photos
Venkatesh Iyer Engagement Photos
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 4:00 PM IST

Updated : Nov 21, 2023, 4:43 PM IST

Venkatesh Iyer Engagement Photos : టీమ్ఇండియా క్రికెట్ వెంకటేశ్ అయ్యర్​ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నాడు. ఈ మేరకు మంగ‌ళ‌వారం శృతి ర‌ఘునాథ‌న్‌ అనే ఫ్యాషన్​ డిజైనర్​తో వెంక‌టేష్ అయ్య‌ర్ నిశ్చితార్థం జ‌రిగింది. ఎంగేజ్‌మెంట్ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయ్యర్​ సోషల్ మీడియా వేదిక ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశాడు. త‌న జీవితంలో కొత్త అధ్యాయం మొద‌లైన‌ట్లు క్యాప్షన్​ రాసుకొచ్చాడు. వెంక‌టేష్ అయ్య‌ర్‌కు పలువురు ఆటగాళ్లతో పాటు అభిమానులు శుభాకాంక్ష‌లు తెలియజేశారు.

Venkatesh Iyer Fiance : వెంకటేశ్​ అయ్యర్​ పెళ్లి చేసుకోబోతున్న శృతి రఘునాథన్.. పీఎస్​జీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత దిల్లీలోని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ ఫ్యాషన్​ టెక్నాలజీ నుంచి మాస్టర్స్​ పూర్తి చేసింది. ప్రస్తుతం బెంగ‌ళూరులో ఫ్యాష‌న్ డిజైనింగ్ కంపెనీలో ప‌నిచేస్తోన్న‌ట్లు తెలుస్తోంది.

Venkatesh Iyer Stats : లెఫ్ట్​ హ్యాండెడ్​ బ్యాటర్​ అయిన అయ్యర్​.. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్- ఐపీఎల్​లో కోల్​కతా నైట్ రైడర్స్- కేకేఆర్ తరఫున ప్రాతినిధ్య వహిస్తున్నాడు. ఇప్పటివరకు 36 ఐపీఎల్ మ్యాచ్​లు ఆడిన ఆ ప్లేయర్​.. 130.25 స్ట్రైక్​ రేట్​తో 956 పరుగులు చేశాడు. ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్​ ఎడిషన్​లో 14 మ్యాచ్​లు ఆడి.. 145.85 స్ట్రైక్​ రేట్​తో 404 పరుగులు బాదాడు. అయితే అయ్యర్​ను వచ్చే ఐపీఎల్ సీజన్​లో కేకేఆర్​ రిటైన్​​ చేసే అవకాశాలున్నాయి. డిసెంబ‌ర్ 19న ఐపీఎల్ వేలం నిర్వ‌హించ‌బోతున్నారు. టీమ్​ఇండియా త‌ర‌ఫున రెండు వ‌న్డేలు, తొమ్మిది టీ20 మ్యాచ్‌లు ఆడాడు వెంక‌టేష్ అయ్య‌ర్‌. ఈ అవ‌కాశాల్ని అత‌డు స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాడు.

Venkatesh Iyer Biography : వెంకటేశ్​ అయ్యర్ 1994 డిసెంబర్ 25న​ మధ్యప్రదేశ్​లోని ఇందౌర్​లో జన్మించాడు. దేశవాళి క్రికెట్​లో టోర్నీల్లో తన ప్రతిభతో సెలెక్టర్ కళ్లలో పడ్డాడు. ఆ తర్వాత 2021లో భారత్​ వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన టీ20 సిరీస్​లో టీమ్​ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాతి ఏడాది అంతర్జాతీయ వన్డేల్లోనూ అరంగేట్ర చేశాడు. గతేడాది ఫిబ్రవరి 27న శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్​లో చివరగా కనిపించాడు.

డ్రెస్సింగ్ రూమ్​లోకి ప్రధాని-టీమ్‌ఇండియా ఆటగాళ్లను ఓదార్చిన మోదీ

ప్రపంచ రికార్డ్​ సృష్టించిన క్రికెట్​ అభిమానులు - స్టేడియంలో వరల్డ్​కప్​ మ్యాచ్​లను వీక్షించిన 12లక్షల మంది

Last Updated : Nov 21, 2023, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.