Varanasi Cricket Stadium : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో.. కొత్త ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏర్పాటు కానుంది. ఈ స్టేడియం నిర్మాణానికి ప్రధాని మోదీ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీసీసీఐ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, బీసీసీఐ కార్యదర్శి జై షా, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, సునీల్ గావస్కర్, రవిశాస్త్రి తదితరులు హాజరయ్యారు.
అయితే ఈ కార్యక్రమంలో భాగంగా టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్.. మోదీకి భారత్ జెర్సీని అందజేశారు. ఒకటో నెంబర్‌తో ఉన్న ఈ జెర్సీ వెనకాల 'నమో' అని రాసి ఉంది. అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా.. ప్రధానికి బ్యాట్ జ్ఞాపికను అందజేశారు. ఇక అంతకుముందు సభలో.. " ఈరోజు వారణాసిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ పుణ్యక్షేత్రంలో నిర్మిస్తున్న ఈ స్టేడియం భగవాన్ శివుడికే అంకితం. ఇది స్థానిక యువతకు ఓ వరం. యావత్ ప్రపంచం క్రికెట్ ద్వారా భారత్‌తో కనెక్ట్ అయ్యింది" అని మోదీ అన్నారు.
Varanasi Cricket Stadium Design : ఈ స్టేడియాన్ని శివతత్వం ఉట్టిపడేలా డిజైన్ చేశారు. త్రిశూలాన్ని పోలిన ప్లడ్‌లైట్లు, శివుడి చేతిలో ఉండే ఢమరుకం రూపంలో పెవిలియన్ స్టాండ్ నిర్మించనున్నారు. సుమారు 30,000 సీటింగ్ సామర్థ్యం ఉండే ఈ స్టేడియాన్ని.. 121 ఎకరాల్లో రూ. .330 కోట్ల వ్యయంతో ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్ నిర్మించనునుంది. ఇక కాన్పుర్, లఖ్‌నవూ తర్వాత యూపీలో నిర్మిస్తున్న మూడో అంతర్జాతీయ స్టేడియం. దీని నిర్మాణం 2025 డిసెంబర్ నాటికి పూర్తయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్టేడియం నమూనా ఫొటోలు ఇప్పటికే బయటకొచ్చి.. క్రీడాప్రియులను తెగ ఆకట్టుకుంటున్నాయి. డిజైన్ అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
-
#WATCH | Sachin Tendulkar with PM Modi and CM Yogi Adityanath at the event to mark the foundation stone laying of an international cricket stadium in Varanasi, UP pic.twitter.com/TjgIHNrelD
— ANI (@ANI) September 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Sachin Tendulkar with PM Modi and CM Yogi Adityanath at the event to mark the foundation stone laying of an international cricket stadium in Varanasi, UP pic.twitter.com/TjgIHNrelD
— ANI (@ANI) September 23, 2023#WATCH | Sachin Tendulkar with PM Modi and CM Yogi Adityanath at the event to mark the foundation stone laying of an international cricket stadium in Varanasi, UP pic.twitter.com/TjgIHNrelD
— ANI (@ANI) September 23, 2023
ఆలయంలో ప్రత్యేక పూజలు.. ఈ కార్యక్రమం అనంతరం భారత మాజీ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్, సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, బీసీసీఐ కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కాశీ విశ్వనాథుడిని దర్శించుకొని.. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు
Team India ODI Ranking 2023 : టీమ్ఇండియా.. క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఫీట్.. నెం.1గా ఘనత