ETV Bharat / sports

U19 World Cup: యువభారత్ చేతిలో ఉగాండా చిత్తు

U19 World Cup: అండర్-19 ప్రపంచకప్​లో యువభారత్ జోరు కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటికే క్వార్టర్స్‌ చేరిన టీమ్ఇండియా తమ చివరి గ్రూప్‌-బి మ్యాచ్‌లో అదరగొట్టింది. ఉగాండాను చిత్తుచేసి సగర్వంగా నాకౌట్స్​కు సిద్ధమైంది.

author img

By

Published : Jan 23, 2022, 7:38 AM IST

U19 World Cup India, India beat Uganda, అండర్ 19 ప్రపంచకప్, ఉగాండాను చిత్తుచేసిన భారత్
U19 World Cup

U19 World Cup: భారత కుర్రాళ్లు ఏం కొట్టారు.. బంతి పడితే బౌండరీ వచ్చేలా.. గాల్లోకి ఎగిరితే స్టాండ్స్‌లో పడేలా.. ఎడాపెడా బాదేశారు. అండర్‌-19 ప్రపంచకప్‌లో ఇప్పటికే క్వార్టర్స్‌ చేరిన యువ భారత్‌ తమ చివరి గ్రూప్‌-బి మ్యాచ్‌లో అదరగొట్టింది. ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు వీరవిహారం చేశారు. రాజ్‌ బవా (162 నాటౌట్‌, 108 బంతుల్లో 14×4, 8×6), రఘువంశీ (144; 120 బంతుల్లో 22×4, 4×6) సెంచరీలతో రెచ్చిపోయారు. దీంతో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 405 పరుగుల భారీ స్కోరు చేసింది.

రాజ్, రఘువంశీ ధనాధన్

ఓపెనర్‌ హర్నూర్‌ (15)తో పాటు కెప్టెన్‌ (15) నిశాంత్‌ విఫలమైనప్పటికీ.. జట్టుపై ఆ ప్రభావం పడకపోవడానికి ప్రధాన కారణం రఘువంశీ, రాజ్‌ జోడీనే. ప్రత్యర్థి బౌలర్లను ఏ మాత్రం లక్ష్య పెట్టకుండా వీళ్లు చెలరేగారు. ఒకరితో మరొకరు పోటీపడుతూ స్కోరుబోర్డును ఉరకలెత్తించారు. ఆ క్రమంలో సెంచరీలు పూర్తి చేసుకున్నారు. మూడో వికెట్‌కు ఈ జోడీ 206 పరుగులు జతచేసింది. ఆ తర్వాత రఘువంశీ ఔటైనా.. రాజ్‌ విధ్వంసాన్ని కొనసాగించాడు. ప్రత్యర్థి బౌలర్లలో పాస్కల్‌ (3/72) ఆకట్టుకున్నాడు.

అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన ఉగాండా 19.4 ఓవర్లలో 79 పరుగులకై ఆలౌటైంది. దీంతో భారత జట్టు 326 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో గ్రూప్‌-బిలో అగ్రాస్థానానికి చేరింది. కెప్టెన్‌ నిషాంత్‌ సింధు నాలుగు వికెట్లు తీశాడు. రాజ్‌ బవాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది అవార్డు వచ్చింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: ఆరు కాదు రెండే.. వెస్టిండీస్‌తో సిరీస్‌ వేదికల్లో మార్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.