క్రికెట్ వ్యాఖ్యాత, టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌పై రోహిత్ శర్మ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసే క్రమంలో వ్యాఖ్యాతగా మంజ్రేకర్ చేసి పని ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఆ సమయంలో మంజ్రేకర్ చేసిన పనికి టీమ్ఇండియా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.
ఏం జరిగిందంటే?
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ 83 పరుగులతో అద్భుతంగా రాణించాడు. లార్డ్స్‌లో రోహిత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అర్ధశతకం చేసేంత వరకు ఆచితూచి బ్యాటింగ్ చేసిన ఈ భారత ఓపెనర్.. హాఫ్‌సెంచరీ తర్వాత ఒక్కసారిగా జోరు పెంచేశాడు. ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్ సెంచరీ కోసం భారత అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే రోహిత్ 81 పరుగుల వద్ద ఉన్న సమయంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంజయ్ మంజ్రేకర్.. అతడిపై ప్రశంసలు కురిపించాడు. హిట్‌మ్యాన్ కచ్చితంగా శతకం సాధిస్తాడని మంజ్రేకర్ కామెంట్ చేసిన మరుక్షణమే.. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు రోహిత్. అప్పటివరకు రోహిత్ సెంచరీ చేస్తాడని ఆశగా ఎదురుచూస్తున్న భారత అభిమానులు నిరాశకు గురయ్యారు. దీంతో మంజ్రేకర్ శాపం వల్లనే రోహిత్ ఔట్ అయ్యాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఘనమైన ఆరంభం..
ఆతిథ్య జట్టు బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ రెండో టెస్టును ఘనంగా ఆరంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (127 బ్యాటింగ్; 248 బంతుల్లో 12×4, 1×6), రోహిత్ శర్మ (83; 145 బంతుల్లో 11×4, 1×6) గొప్పగా బ్యాటింగ్ చేయడం వల్ల మొదటి రోజు, గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. చక్కగా బ్యాటింగ్ చేసిన కెప్టెన్ కోహ్లీ (42; 103 బంతుల్లో 3×4) దురదృష్టవశాత్తు ఆఖర్లో ఔటయ్యాడు. రాహుల్‌తో పాటు రహానె (1) క్రీజులో ఉన్నాడు. రెండు రోజూ మెరుగైన బ్యాటింగ్‌ను కొనసాగిస్తే మ్యాచ్‌లో భారత్‌కు ఇక తిరుగుండదు.
ఇదీ చూడండి.. ఇంగ్లాండ్‌లో కోహ్లీ వైఫల్యానికి అదే కారణమా?