ETV Bharat / sports

దేశంలోనే తొలిసారిగా అలాంటి క్రికెట్​ బ్యాట్​ల తయారీ!

దేశంలోనే తొలిసారిగా వెదురుతో ఫ్రొఫెషనల్​ క్రికెట్​ బ్యాట్లను (Bamboo Bat) తయారు చేసింది త్రిపురలోని బ్యాంబూ, కేన్ అభివృద్ధి సంస్థ. అందుకోసం అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేసింది.

bamboo bat
Bamboo Bat Cricket
author img

By

Published : Nov 2, 2021, 5:31 AM IST

బ్యాట్ల తయారీలో సరికొత్త ఆవిష్కరణకు ప్రాణం పోసింది (Tripura News) త్రిపురలోని బ్యాంబూ, కేన్ అభివృద్ధి​ సంస్థ (బీసీడీఐ). అన్ని ప్రమాణాలను పాటిస్తూ దేశంలోనే తొలిసారిగా వెదురుతో క్రికెట్ బ్యాట్లను (Bamboo Bat) తయారు చేసింది. నార్త్​ ఈస్ట్​ సెంటర్​ ఆఫ్​ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీచ్​తో (నెక్టార్​) సంయుక్తంగా ఈ ప్రాజెక్టును (NECTAR News) చేపట్టింది బీసీడీఐ.

ఈ బ్యాట్లను క్రికెట్​లోని అన్ని ఫార్మాట్లలో వినియోగించవచ్చని అధికారులు తెలిపారు. వాటిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు నిపుణుల సూచనల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. బూమ్​ అనే (Bamboo Bat Cricket) వెదురుతో బ్యాట్లు, కనక్కాయిచ్​ అనే రకంతో వికెట్లను తయారు చేసినట్లు వెల్లడించారు.

బ్లూ బోర్డు సాంకేతికతతో..

"ఈ బ్యాట్ల తయారీకి బ్యాంబూ బ్లూ బోర్డు అనే సాంకేతికతను వాడాము. సంప్రదాయ పద్ధతిలో కాకుండా బ్యాట్ల తయారీలో వెదురును వాడటంపై 4 నెలల కిందే కేంబ్రిడ్జి యూనివర్సిటీ పత్రికలో ఓ వ్యాసం ప్రచురితమైంది. దాని ఆధారంగా నెక్టార్, బీసీడీఐ ఈ ప్రాజెక్టును రూపొందించాయి."

- అభినవ్ కాంత్, బీసీడీఐ-నెక్టార్ హెడ్

బ్యాంబూ బోర్డు సాంకేతికతను (Bamboo Board Technology) అభివృద్ధి చేసి.. బోర్డులను బ్యాట్లుగా రూపుదిద్దినట్లు అభినవ్ కాంత్ తెలిపారు. "కనక్కాయిచ్​ బ్యాంబూతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దృఢమైన వికెట్లను తయారు చేశాం. బ్యాట్లను సమీక్ష కోసం నిపుణుల వద్దకు పంపిస్తాం. అనంతరం స్థానిక పారిశ్రామికవేత్తలు, మార్కెటింగ్​ సంస్థలతో ఈ సాంకేతికతను పంచుకొని, బ్యాట్లను పెద్దఎత్తున ఉత్పత్తి చేయనున్నాం." అని కాంత్ వెల్లడించారు.

ఇదీ చూడండి: టీమ్ఇండియా బ్యాట్స్​మెన్ ఎలా ఔటయ్యారో చూడండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.