ETV Bharat / sports

2024 ఐపీఎల్ వేలంలో ఫారిన్ ప్లేయర్లు- అందరి కళ్లు వీరిపైనే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 8:02 PM IST

Top Foreign Players In IPL Auction 2024 : క్రికెట్ అభిమానులను ఉర్రూతలూరించే ఐపీఎల్​ వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఈ క్రమంలో అన్​క్యాప్​డ్ ప్లేయర్ల నుంచి, స్టార్ ఆటగాళ్ల దాకా అందరూ తమ పేరును వేలంలో రిజిస్టర్ చేసుకున్నారు. మరి ఈ వేలంలో టాప్ 10లో ఉండే విదేశీ ప్లేయర్లపై ఓ లుక్కేద్దామా?

top foreign players in ipl auction 2024
top foreign players in ipl auction 2024

Top Foreign Players In IPL Auction 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2024 కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరిగే వేలంలో, ఏ ఫ్రాంచైజీ ఏ ప్లేయర్​ను దక్కించుకుంటుందో అని అందరూ ఆత్రుతగా చూస్తున్నారు. అయితే ఈసారి వేలంలో టాప్ 10లో నిలవనున్న ఫారిన్ ప్లేయర్లు ఎవరో తెలుసుకుందాం.

  1. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) : దాదాపు 5 సీజన్​ల తర్వాత మిచెల్ స్టార్క్ ఐపీఎల్​లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. చివరిసారిగా స్టార్క్ 2018లో కోల్​కతా నైట్ రైడర్స్ జట్టుకు రూ. 9.4 కోట్లకు అమ్మడయ్యాడు. కానీ, వెన్నుగాయం కారణంగా స్టార్క్ ఆ సీజన్​లోనూ ఆడలేదు. ఇక రీసెంట్​గా ముగిసిమ వరల్డ్​కప్​లో మంచి ప్రదర్శన కనబర్చిన స్టార్క్​, ఈ వేలంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
  2. ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) : ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్​ సైతం ఈసారి వేలంలో భారీ ధర దక్కించుకునే ఛాన్స్​లు ఉన్నాయి. అతడు ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్, కోల్​కతా నైట్ రైడర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. చివరిసారిగా 2022లో కమిన్స్​ కోల్​కతా తరఫున ఆడాడు. గతంలో రూ. 7.5 కోట్లు పలికిన కమిన్స్ ఈ వేలంలో ఎంత మేరకు ప్రభావం చూపుతాడో వేచి చూడాలి.
  3. ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా) : ట్రావిస్ హెడ్ గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్, జట్ల తరఫున ఆడాడు. కానీ, ఐపీఎల్​లో హెడ్ చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. అయితే 2023 వరల్డ్​కప్​లో మాత్రం అదరగొట్టిన హెడ్​పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రానున్న వేలంలో హెడ్​ భారీ ధరకు అమ్మడవ్వచ్చని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
  4. డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) : న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఈ వేలంలో హాట్​ ప్లేయర్​గా మారాడనడంలో సందేహం లేదు. తాజా ప్రపంచకప్​లో అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టాడు మిచెల్. పరిస్థితులకు తగ్గట్టు ఆడే సామర్థ్యం ఉన్న మిచెల్​ కోసం పంజాబ్ కింగ్స్, కోల్​కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడే అవకాశం ఉంది.
  5. రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్): న్యూజిలాండ్ యంగ్ టాలెంటెడ్ రచిన్ రవీంద్రకు ఈ వేలంలో డిమాండ్ బాగా ఉండనుంది. తాజా వరల్డ్​కప్​లో సత్తా చాటిన రచిన్​ను కొనుగోలు చేయడానికి దాదాపు అన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి చూపే ఛాన్స్ ఉంది. బ్యాటింగే కాకుండా బౌలింగ్ కూడా చేయగలగడం అతడికి ప్లస్ పాయింట్. ఇక 2023 వరల్డ్​కప్​లో 578 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
  6. జోష్ హేజిల్​వుడ్ (ఆస్ట్రేలియా) : ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హేజిల్​వుడ్​ను రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు వదులుకోవడం వల్ల వేలంలోకి వచ్చాడు. కచ్చితమైన యార్లర్లు, బౌన్స్​ రాబట్టడంలో హేజిల్​వుడ్ స్పెషలిస్ట్. ఈ ఆసీస్ పేసర్​ను ఏ జట్టు దక్కించుకుంటుందో చూడాలి. ​
  7. ఆదిల్ రషీద్ ( ఇంగ్లాండ్ ) : ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టీ20ల్లో చెప్పుకోదగ్గ ఆటగాడు. గతంలో పంజాబ్​ తరఫున ప్రాతినిధ్యం వహించిన రషీద్​, ఈసారి ఏ ఫ్రాంచైజీలో చెరతాడో చూడాలి. బౌలింగ్​తో పాటు జట్టుకు అవసరమైనప్పుడు బ్యాట్​తోనూ రాణించగల సత్తా రషీద్​కు ఉంది.
  8. హ్యారీ బ్రూక్ ( ఇంగ్లాండ్ ) : ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్​ హ్యారీ బ్రూక్​ను గత సీజన్​లో సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 13.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ, గత సీజన్​లో బ్రూక్ ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్​లో సెంచరీతో రాణించిన బ్రూక్, తర్వాత తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడు. దీంతో హైదరాబాద్​ బ్రూక్​ను వదులుకుంది. అయితే ఈసారి బ్రూక్​ అంత ధర పలకకపోవచ్చు.
  9. డేవిడ్ మలన్ (ఇంగ్లాండ్ ) : డేవిడ్ మలన్ టీ20ల్లో డాషింగ్ బ్యాటర్​గా పేరొందాడు. క్రీజులో కుదురుకుంటే విధ్వంసం సృష్టించగల మలన్​ను ఏ ఫ్రాంచైజీ దక్కించుకుంటుందో చూడాలి. ఇంగ్లాండ్ తరఫున పలు అంతర్జాతీయ టోర్నీలు ఆడిన మలన్ ఈ వేలంలో ఎంత మేరకు ప్రభావం కనబరుస్తాడనేది ఆసక్తిగా మారింది.
  10. జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లాండ్) : వరుస గాయాల నుంచి కోలుకున్న ఆర్చర్, ఈ వేలంలో ఇంట్రెస్టింగ్ ప్లేయర్​గా మారాడు. 2022 అతడ్ని ముంబయి ఇండియన్స్ రూ. 8 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, గాయం కారణంగా 2022 సీజన్​లో ఆడని ఆర్చర్, గత ఐపీఎల్​లో బరిలో దిగాడు. అయితే అతడు పెద్దగా ప్రభావం చూపకపోవడం వల్ల ముంబయి అతడిని వదులుకుంది.

Who do you think will be the most sought-after player this #IPLAuction? 🤔

Share your predictions! 👇#IPL pic.twitter.com/utALqKCeCV

— IndianPremierLeague (@IPL) December 12, 2023

వరల్డ్​కప్​లో టాప్​ - ఐపీఎల్​లో ఎంట్రీ- మినీ వేలంలో భారీ ధర పలకనున్న స్టార్స్ వీరే!

ఐపీఎల్ వేలంలో ఫ్రాంఛైజీలను ఆకర్షిస్తున్న ఇండియన్ క్రికెటర్లు వీళ్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.