ETV Bharat / sports

టీమ్ఇండియాపై టిమ్​పైన్​ ఫైర్.. ప్రమాదంలోకి నెట్టేశారంటూ.. - tim paine fire on teamindia

Tim paine Border gavaskar: టీమ్​ఇండియాపై ఆస్ట్రేలియా మాజీ టెస్టు సారథి టిమ్‌పైన్‌ మండిపడ్డాడు. పలువురు భారత ఆటగాళ్లు వాళ్ల జట్టును ప్రమాదంలోకి నెట్టేలా చేశారని ఆరోపించాడు!

teamindia australia
టీమ్​ఇండియా ఆస్ట్రేలియా
author img

By

Published : Jun 18, 2022, 8:37 AM IST

Tim paine Border gavaskar: టీమ్​ఇండియాపై ఆస్ట్రేలియా మాజీ టెస్టు సారథి టిమ్‌పైన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 2020-2021 బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో పలువురు భారత ఆటగాళ్లు బయోబబుల్‌ నిబంధనలు ఉల్లంఘించి సిరీస్‌ మొత్తాన్ని ప్రమాదంలోకి నెట్టేలా చేశారని మండిపడ్డాడు. ఆ సిరీస్‌కు సంబంధించి తాజాగా ఓ డాక్యుమెంటరీ సిరీస్‌ రూపొందుతున్న నేపథ్యంలో పైన్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

అసలేం జరిగిదంటే.. ఆ టెస్టు సిరీస్‌ ప్రారంభానికి ముందు టీమ్‌ఇండియా ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌, శుభ్‌మన్‌గిల్‌, పృథ్వీ షా, నవ్‌దీప్‌ సైని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారని, అక్కడ వారిని కలిసినట్లు, వాళ్ల బిల్‌ కూడా కట్టినట్లు ఓ నెటిజన్‌ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేశాడు. అయితే, తర్వాత అతడు టీమ్‌ఇండియా ఆటగాళ్లు తనకు దూరంగా ఉన్నారని మాట మార్చాడు.. దీంతో ఆస్ట్రేలియా మీడియా ఆ విషయాన్ని పెద్దది చేస్తూ భారత ఆటగాళ్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని, బీసీసీఐ వారిపై చర్యలకు ఉపక్రమించిందని రాసుకొచ్చాయి. అయితే, బీసీసీఐ వాటిని కొట్టిపారేసింది.

ఈ విషయంపై పైన్‌ మాట్లాడుతూ.. "టీమ్‌ఇండియాలో పలువురు ఆటగాళ్లు మొత్తం సిరీస్‌నే ప్రమాదంలోకి నెట్టేలా చేశారు. అది కూడా స్నాక్స్‌ తినడం కోసం. ఇతరుల గురించి ఆలోచించకుండా నిబంధనలకు విరుద్ధంగా రెస్టారెంట్‌కు వెళ్లడం స్వార్థపూరితం. వాళ్లు అలా చేయడం మా జట్టులోని పలువురు ఆటగాళ్లకు బాధ కలిగించింది. ముఖ్యంగా బయోబబుల్‌ నిబంధనలను గౌరవించి క్రిస్మస్‌ పండుగకు ఇంటికి కూడా వెళ్లలేని వారు చాలా బాధపడ్డారు. మా ఆటగాళ్లు త్యాగాలు చేస్తే టీమ్‌ఇండియా ఆటగాళ్లు నిబంధనలు ఉల్లఘించి బాధ్యతా లేకుండా ప్రవర్తించడం ఏమాత్రం నచ్చలేదు" అని పైన్‌ పేర్కొన్నాడు.

అయితే, ఇదే విషయంపై అప్పటి తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానె స్పష్టతనిచ్చాడు. టీమ్‌ఇండియా ఆటగాళ్లు అప్పుడు టేక్‌అవే కోసం రెస్టారెంట్‌కు వెళ్లారని, ఆ సమయంలో బయటి వాతావరణం బాగాలేకపోవడంతో లోపల వేచి ఉన్నారని తెలిపాడు.

ఇదీ చూడండి: ఇతనో కొత్త దినేశ్​ కార్తీక్‌​.. మళ్లీ 15ఏళ్ల తర్వాత అలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.