ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఫ్రెండ్స్: ది రీ యూనియన్(Friends: The Reunion) వెబ్ సిరీస్ కొత్త సీజన్ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. దానికి సంబంధించిన స్టోరీలతో ఇంటర్నెట్ మొత్తం నిండిపోయింది. త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత్ క్రికెటర్లు.. క్వారంటైన్లో దీనిని చూస్తున్నారు. 'లవ్ ది ఫ్రెండ్స్ రీయూనియన్' అంటూ బుమ్రా పోస్ట్ చేశాడు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మాత్రం వినూత్న రీతిలో 'ఫ్రెండ్స్' వెబ్ సిరీస్‌పై పోస్ట్ పెట్టాడు.
"ఫ్రెండ్స్, నేను ఈ రీయూనియన్ కోసం ఎదురుచూస్తున్నాను" అని అభిమానులతో సందడిగా ఉన్న స్టేడియం, అందులో తాను ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అయితే ఈ ఏడాది స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టీమ్ఇండియా ఆడిన మ్యాచ్‌ల కోసం అభిమానుల్ని అనుమతించారు. కానీ కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో ఇతర మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్‌ను బయో బబుల్‌లో నిర్వహించారు. కానీ పలువురు ప్లేయర్లకు కొవిడ్ సోకడం వల్ల సీజన్‌ను మధ్యలోనే ఆపేశారు. ఈ నేపథ్యంలో రోహిత్, అభిమానుల మధ్య ఆడేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు.
ఇవీ చదవండి: