లఖ్‌నవూ వేదికగా జరిగిన భారత్-కివీస్ టీ20 పోరు అత్యంత ఉత్కంఠంగా సాగింది. అయితే విజయం మాత్రం భారత్‌నే వరించింది. కానీ మూడో టీ20లో గెలుపెవరిదో చెప్పడం కష్టమనే అంటున్నారు అభిమానులు. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌లో మూడు కీలక రికార్డులు బద్దలయ్యేలా ఉన్నాయి. అవేంటంటే..
టీమ్ఇండియా బ్యాటర్స్‌పై సోధి కన్ను..
టీమ్ ఇండియాకున్న బలాల్లో బ్యాటింగ్ ఒకటి. అలా బలమైన బ్యాటింగ్ లైనప్‌ను ఏర్పరుచుకున్న టీమ్ఇండియాను చూస్తే ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే. కానీ కొందరు బౌలర్లు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా భారత్‌ను గట్టిగా దెబ్బ తీస్తారు. వారిలో కివీస్ స్పిన్నర్ ఇష్ సోధీ ఒకడు. భారత్‌పై అతను తీసుకున్నన్ని టీ20 వికెట్లు మరెవరూ తీసుకోలేదు. ఇప్పటి వరకు భారత్‌తో 19 మ్యాచులు ఆడిన అతను 26 వికెట్లు తీసుకున్నాడు. అతను మూడో టీ20లో మరొక్క వికెట్ తీసుకున్నాడంటే.. ఒక ప్రత్యర్థిపై అత్యధిక టీ20 వికెట్లు తీసుకున్న రెండో బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఈ జాబితాలో ఐర్లాండ్‌పై 37 వికెట్లు తీసుకున్న రషీద్ ఖాన్ తొలి స్థానంలో ఉన్నాడు.
ఛలో సూర్యా భాయ్..
ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో మంచి ఫామ్‌తో దూసుకెళ్తున్న ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. ఈ టీమ్ ఇండియా స్టార్ గతేడాది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా జరిగే మూడో టీ20లో కూడా ఇదే జోరు కొనసాగిస్తే.. మరో అరుదైన రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో అతను 63 పరుగులు చేస్తే న్యూజిల్యాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో అతను రెండో స్థానానికి చేజిక్కిచ్చుకుంటాడు. కాగా ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచుల్లో కివీస్‌పై సూర్య 260 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న కేఎల్ రాహుల్ (322)ను దాటాలంటే...సూర్య మరో 63 పరుగులు చేయాలి. ఇప్పటికే ఈ జాబితాలో రోహిత్ శర్మ (511) మొదటి స్థానంలో ఉన్నాడు.
కివీస్ ముందు కీలక ఛాన్స్
్రపంచ క్రికెట్‌లో బలమైన జట్లలో కివిస్ జట్టు ఒకటి. కానీ భారత గడ్డపై ఈ జట్టు ఇప్పటి వరకు ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా గెలవలేదు. 2012లో ఆడిన టీ20 సిరీస్‌ను ఆ జట్టు నెగ్గినా.. ఆ సిరీస్‌లో ఒకే ఒక్క మ్యాచ్ జరిగింది. ఇక మరో సారి కివీస్ ఒక సిరీస్ నెగ్గలేదు. ఆ అవకాశం వాళ్లకు ఇప్పుడు అడుగు దూరంలో నిలిచింది. ఒక వేళ అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్ సేన గెలిస్తే.. భారత గడ్డపై రెండు, అంతకన్నా ఎక్కువ మ్యాచులు ఉన్న సిరీస్ గెలిచిన రికార్డును సొంతం చేసుకుంటుంది. ఈ ఫీట్‌ను సాధించాలని కివిస్ సేన చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది.
ఇదీ చదవండి:
ICC ర్యాంకుల్లో అమ్మాయిల జోరు.. టాప్ ప్లేస్‌కు దీప్తి ఎసరు.. స్మృతి స్థానం ఎంతంటే?
న్యూజిలాండ్‌తో మూడో టీ20.. సిరీస్ దక్కాలంటే.. టాప్ ఆర్డర్ గాడిలో పడాల్సిందే!