ETV Bharat / sports

'ది హండ్రెడ్' లీగ్​లో మరో భారత క్రికెటర్!

యూకేలో జరగనున్న ది హండ్రెడ్​ ప్రారంభ లీగ్​లో మరో భారత మహిళా యువ క్రికెటర్ పాల్గొననుంది. యువ సంచలనం షెఫాలీ వర్మ.. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఆడనుంది.

The Hundred: Shafali Verma to play for Birmingham Phoenix
'ది హండ్రెడ్' లీగ్​లో మరో భారత క్రికెటర్!
author img

By

Published : May 10, 2021, 12:18 PM IST

యూకే వేదికగా జరగనున్న 'ది హండ్రెడ్​' ప్రారంభ లీగ్​లో.. భారత మహిళ క్రికెట్ యువ సంచలనం షెఫాలీ వర్మ ఆడనుంది. ఇప్పటికే టీ20 కెప్టెన్​ హర్మన్​ప్రీత్ కౌర్​తో పాటు స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్​, దీప్తి శర్మ.. ఈ టోర్నీలో ఆడటానికి భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) నుంచి నో ఆబ్జెక్షన్​ సర్టిఫికేట్​ (ఎన్​ఓసీ)ను పొందారు. కివీస్ ఆల్​రౌండర్​ సోఫీ డేవిన్​ నేతృత్వంలోని బర్మింగ్​హామ్​ ఫోనిక్స్​ జట్టు తరఫున బరిలోకి దిగనుంది.

ఇప్పుడు షెఫాలీ కూడా ఈ జాబితాలో చేరింది. బీసీసీఐ నుంచి నిరభ్యంతర పత్రం పొందినట్లు క్రికెట్ వర్గాలు ధ్రువీకరించాయి. "షెఫాలీకి మాత్రమే కాదు.. మొత్తం భారత మహిళల క్రికెట్​కే ఇది శుభవార్త. ప్రారంభ సీజన్​ అయిన 'ది హండ్రెడ్​' లీగ్​లో ఐదుగురు భారతీయులు పాల్గొనడం గొప్ప విషయం. తన దూకుడైన ఆటతీరుతో ఇప్పటికే విజయవంతమైన షెఫాలీకి.. ఈ టోర్నీ మరింత దోహదం చేస్తుంది." అని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.
గత మార్చిలో దక్షిణాఫ్రికాతో సిరీస్​లో రాణించిన షెఫాలీ.. తన ఫుట్​వర్క్​ వెనక ఉన్న రహస్యాన్ని బయటపెట్టింది. సయ్యద్ ముస్తాక్ టోర్నీకి ముందు హరియాణా పురుషుల జట్టుతో కలిసి సాధన చేయడం కలిసొచ్చిందని తెలిపింది.

ఇదీ చూడండి:- రెజ్లర్ సుశీల్​ కుమార్​కు లుక్​ఔట్​ నోటీసులు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.