ETV Bharat / sports

The Ashes 2023 : షేన్​ వార్న్​ 'బాల్​ ఆఫ్​ ది సెంచరీ' గుర్తుందా? - యాషెస్ సిరీస్‌ ఇంగ్లాండ్​

The Ashes 2023 : డబ్ల్యూటీసీ ఫైనల్‌ తర్వాత మళ్లీ టెస్టు మజాను అందించడానికి మరో సిరీస్‌ సిద్ధమైపోయింది. ప్రతిష్ఠాత్మకమైన యాషెస్‌ సిరీస్‌ శుక్రవారం నుంచే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 1993 యాషెస్​ సిరీస్​లో షేన్‌ వార్న్‌.. బాల్​ ఆఫ్​ ది సెంచరీని ఓ సారి గుర్తు చేసుకుందాం.

the ashes 2023
the ashes 2023
author img

By

Published : Jun 15, 2023, 4:17 PM IST

The Ashes 2023 : క్రికెట్‌కు పుట్టినిల్లు ఇంగ్లాండ్‌ వేదికగా మరో కీలక సమరానికి సమయం ఆసన్నమైంది. శుక్రవారం నుంచి ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో ఇరు జట్లకూ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ మూడో సీజన్‌ కూడా మొదలుకానుంది. గత యాషెస్‌ సిరీస్‌ను ఆసీస్ గెలుచుకోగా.. సొంతగడ్డపై తిరిగి దానిని దక్కించుకోవాలని ఇంగ్లాండ్‌ పట్టుదలతో ఉంది. అయితే యాషెస్​ సిరీస్​ అనగానో కొన్ని ప్రత్యేకమైన విషయాలు గురొస్తాయి. అందులో షేన్​ వార్న్.. బాల్ ఆఫ్​ ది సెంచరీ ఒకటి. ఇంగ్లాండ్​తో 1993 యాషెస్​ సిరీస్​లో జరిగిన ఆ అద్భుతాన్ని అలా ఓ సారి గుర్తు చేసుకుందాం..

వార్న్ బాల్​ ఆఫ్​ ది సెంచరీ..
Ball of The Century: లెగ్‌స్పిన్‌తో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న షేన్‌వార్న్‌ బంతితో మాయ చేశాడు. ముఖ్యంగా లెగ్‌స్టంప్‌కు ఆవల బంతి వేస్తూ ఆఫ్‌ స్టంప్‌ను ముద్దాడేలా దాన్ని స్పిన్‌ చేయడంలో వార్న్‌ దిట్ట. అందుకే అతడు వేసిన ఓ డెలివరీ "శతాబ్దపు మేటి బంతి"గా చరిత్రలో నిలిచిపోయింది. ఇంగ్లాండ్‌తో 1993 యాషెస్‌ సిరీస్‌లో తొలి టెస్టు ఆ అద్భుతానికి వేదికైంది. అప్పటికీ వార్న్‌కు 11 టెస్టుల అనుభవం మాత్రమే ఉంది. పైగా అది అతనికి తొలి యాషెస్‌ టెస్టు.

మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 289 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఓ వికెట్‌ పడ్డాక స్పిన్‌ను సమర్థంగా ఆడతాడనే పేరున్న మైక్‌ గాటింగ్‌ క్రీజులోకి వచ్చాడు. అప్పుడే వార్న్‌ తొలి ఓవర్‌ వేసేందుకు సిద్ధమయ్యాడు. నెమ్మదిగా రనప్‌ చేసి వచ్చి మొదటి బంతి వేశాడు. నేరుగా వచ్చేలా కనిపించిన ఆ బంతి లెగ్‌స్టంప్‌ లైన్‌కు కొన్ని అంగుళాల ఆవల పడింది. ప్యాడు, బ్యాట్‌ను అడ్డుపెట్టి దాన్ని ఎదుర్కోవాలని గాటింగ్‌ చూశాడు. కానీ అనూహ్యంగా స్పిన్‌ అయిన ఆ బంతి.. ప్యాడు, బ్యాట్‌ను దాటి వెళ్లి ఆఫ్‌స్టంప్‌ను తాకింది. ఏం జరిగిందో తెలీక గాటింగ్‌ ఆశ్చర్యంతో పిచ్‌ వైపు చూసి పెవిలియన్‌ బాట పడ్డాడు.

బాడీ లైన్​ టెక్నిక్​..
Body Line Techique : అది 1932-33 యాషెస్ సిరీస్. ఆస్ట్రేలియన్ సూపర్ స్టార్ డాన్ బ్రాడ్‌మన్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా తన ఇన్నింగ్స్​తో అలరిస్తున్నాడు. డాన్ బ్రాడ్‌మాన్ ఇంగ్లాండ్‌కు పెను ముప్పులా ఆడే వాడు. అయితే ఆసీస్​ బ్యాటర్లను కట్టడి చేసేందుకు ఇంగ్లాండ్ 'బాడీలైన్' టెక్నిక్‌ను ప్రయోగించింది.

ఇంగ్లాండ్ బౌలర్లు.. ప్రత్యర్థి బ్యాటర్ల శరీరాలను తాకేలా బంతులు సంధించారు. ఆ సమయంలో బ్యాటర్లు తమ ఛాతీ, తలను బ్యాట్​తో రక్షించుకునే క్రమంలో లెగ్ సైడ్‌లో నిలబడి ఉన్న ఫీల్డర్‌లు క్యాచ్ పట్టుకునే ప్రయత్నించారు. ఆ విషయంలో ఇంగ్లాండ్​ బౌలర్లు సక్సెస్​ అయ్యారు. కొంతమంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు మైదానంలో గాయాలపాలయ్యారు. ఆ తర్వాత మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) ఈ టెక్నిక్​లో చాలా మార్పులు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.