టీమ్‌ఇండియా యువ పేస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తన వన్డే అరంగేట్రంలోనే సంచలనం నమోదు చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఉమ్రాన్ నిలకడగా 145 కి.మీకిపైగా వేగంతో బంతులు సంధించి కివీస్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. తన తొలి ఐదు ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే, తన చివరి ఐదు ఓవర్లలో ఉమ్రాన్ మాలిక్ ప్రభావం చూపలేకపోయాడు.
16వ ఓవర్‌లో తొలి బంతికి కివీస్ ఓపెనర్ డేవాన్ కాన్వే (24)ను ఔట్ చేయడం ద్వారా వన్డేల్లో తన తొలి వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు ఈ టీమ్‌ఇండియా స్పీడ్‌స్టార్. ఈ ఓవర్‌లో రెండో బంతినే 153.1 కి.మీ. వేగంతో విసిరి అందరి దృష్టిని ఆకర్షించాడు. తన ఐదో ఓవర్‌లో డారిల్ మిచెల్ (11)ని పెవిలియన్‌కి పంపి రెండో వికెట్ నమోదు చేసుకున్నాడు. మొత్తంమ్మీద ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ 10 ఓవర్లు బౌలింగ్ చేసి 66 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియాపై కివీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 307 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ 3 వికెట్లు నష్టపోయి 47.1 ఓవర్లలోనే ఛేదించింది.
-
we have a feeling we're going to be fans of Umran Malik a while! 💯#NZvINDonPrime #CricketOnPrime pic.twitter.com/3SHw4ZUjBm
— prime video IN (@PrimeVideoIN) November 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">we have a feeling we're going to be fans of Umran Malik a while! 💯#NZvINDonPrime #CricketOnPrime pic.twitter.com/3SHw4ZUjBm
— prime video IN (@PrimeVideoIN) November 25, 2022we have a feeling we're going to be fans of Umran Malik a while! 💯#NZvINDonPrime #CricketOnPrime pic.twitter.com/3SHw4ZUjBm
— prime video IN (@PrimeVideoIN) November 25, 2022
ఇదీ చూడండి: టీమ్‌ఇండియా న్యూజిలాండ్ తొలి వన్డే మ్యాచ్ చిత్రాలు చూశారా