ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమ్ఇండియా విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 91 పరుగుల లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా 3 వికెట్ల తీయగా.. కుమిన్స్ ఒక వికెట్ తీశాడు.
కాగా, స్టేడియం అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటం వల్ల దాదాపు రెండున్నర గంటలు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. 8 ఓవర్లకు మ్యాచ్ కుదించారు. మ్యాచ్లో భాగంగా మొదటగా టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఐదు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 91 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. మ్యాథ్యూ వేడ్ (43*) ధాటిగా ఆడేయగా.. ఆరోన్ ఫించ్ (31) కూడా దంచేశాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 2, బుమ్రా ఒక వికెట్ తీశారు.
ఇదీ చూడండి: నా కెరీర్‌లో అదొక్కటే అసంతృప్తి: ఝులన్ గోస్వామి