ETV Bharat / sports

'ICC ప్లేయర్​ ఆఫ్​ ది మంత్'​గా శుభ్​మన్​ గిల్​

టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్​ శుభ్​మన్​ గిల్​..​ మరో ఘనత దక్కించుకున్నాడు. న్యూజిలాండ్​​, శ్రీలంక సిరీస్​ల్లో అద్భుత ప్రదర్శనతో జనవరి నెలకు గానూ ఐసీసీ 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​​' అవార్డు సాధించాడు.

icc player of the month
icc player of the month
author img

By

Published : Feb 13, 2023, 9:34 PM IST

క్రికెట్​లో అత్యంత వేగంగా ఎదుగుతోన్న టీమ్ఇండియా బ్యాటర్​ శుభ్​మన్​ గిల్​​.. జనవరి నెలకు గానూ ఐసీసీ 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​'గా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్​పై అద్భుత ప్రదర్శన చేసి ఈ ఘనత దక్కించుకున్నాడు. గత నెలలో శ్రీలంక, కివీస్​తో జరిగిన సిరీస్‌లలో శుభ్​మన్​ రాణించాడు. న్యూజిలాండ్‌తో హైదరబాద్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో అద్భుత ప్రదర్శన చేసిన గిల్.. అనంతరం టీ20 సిరీస్‌లోను సెంచరీ సాధించి మెరిశాడు. దీంతో పాటు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ గిల్‌ ఓ సెంచరీ చేశాడు.

icc player of the month january
శుభ్​మన్​ గిల్

మొత్తంగా జనవరిలో శుభ్​మన్‌ 567 పరుగులు బాదాడు. ఇక, ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు కోసం భారత జట్టు స్టార్​ పేసర్ మహ్మద్​ సిరాజ్​, న్యూజిలాండ్ బ్యాటర్ డెవన్‌ కాన్వే​తో.. శుభ్​మన్ గిల్ పోటీ పడ్డాడు. అయినా ఐసీసీ అవార్డు గిల్​నే వరించింది.
కాగా, మహిళల విభాగంలో జనవరి నెలకు గాను 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డును ఇంగ్లాండ్ యువ ప్లేయర్ గ్రేస్ స్క్రీవెన్స్​ను వరించింది. జనవరిలో జరిగిన అండర్​-19 వరల్డ్​కప్​లో ఈ క్రికెటర్​ అద్భుత ప్రదర్శన చేసింది. ఇక, ఈ అవార్డు సాధించిన అతిచిన్న వయసు క్రికెటర్​గా​ రికార్డు సృష్టించింది.

icc player of the month january
గ్రేస్ స్క్రీవెన్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.