ETV Bharat / sports

స్విమ్మింగ్​ పూల్​లో పంత్​.. వీడియో వైరల్​.. ఆరోగ్యం ఎలా ఉందంటే?

author img

By

Published : Mar 15, 2023, 6:00 PM IST

కారు యాక్సిడెంట్​ తర్వాత వాకింగ్​ స్టిక్​తో నడుస్తున్న ఫొటోలు షేర్​ చేసిన టీమ్​ఇండియా క్రికెటర్​ రిషభ్​ పంత్​.. తాజాగా ఓ వీడియో షేర్​ చేశాడు. మినీ స్విమ్మింగ్​ పూల్​లో వాకింగ్​ స్టిక్​ పట్టుకుని నడుస్తూ కనిపించాడు. దీంతో నెటిజన్లతో సహా సినీ, క్రికెట్ ప్రముఖులు పంత్​ త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.

team india cricketer rishabh pant health update walking video

ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్​ రిషభ్​ పంత్​.. మెల్లమెల్లగా కోలుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం.. వాకింగ్​ స్టిక్​ పట్టుకుని నడుస్తున్న ఫొటోలను పంత్​ షేర్​ చేశాడు. తాజాగా తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో మరో వీడియోను పంచుకున్నాడు. అందులో మినీ స్విమ్మింగ్​ పూల్​లో​ చేతి కర్ర సాయంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నట్లు పంత్​ కనిపించాడు.

అయితే ఆ వీడియో చూస్తుంటే పంత్‌ కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోకు పంత్​ ఎమోషనల్​ లైన్​ రాసుకొచ్చాడు. పెద్ద విషయాలకు చిన్న విషయాల మధ్య జరిగిన ప్రతీ దానికి కృతజ్ఞతలు అంటూ వీడియోను పోస్ట్​ చేశాడు. కాగా, పంత్​ పెట్టిన ఈ పోస్టులకు నెటిజన్లతో పాటు ప్రముఖ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం నడుస్తున్న ఫొటోలను షేర్​ చేసిన పంత్​.. 'ఒక అడుగు ముందుకు, ఒక అడుగు బలంగా, ఒక అడుగు బెటర్​గా' అంటూ క్యాప్షన్​ జోడించాడు. దీంతో పాటు ఇన్​స్టాగ్రామ్​లో ఓ స్టోరీని కూడా పోస్ట్​ చేశాడు. అందులో లూడో ఆడుతున్న ఫొటోను జత చేసి 'నేను ఇంత కన్నా ఏం చేయగలను.. ఏమైనా సూచనలు ఇవ్వగలరా' అంటూ రాసుకొచ్చాడు.

రిషభ్​ పంత్ గతేడాది గతేడాది డిసెంబర్‌ 30న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తల్లికి సర్​ప్రైజ్​ ఇద్దామని దిల్లీ నుంచి లఖ్​నవూకు వెళ్తున్న సమయంలో రూర్కీ సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పలు శస్త్ర చికిత్సలు నిర్వహించిన తర్వాత.. పంత్‌ కోలుకోవడానికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ట

ఇక పంత్​ కెరీర్​ విషయానికొస్తే.. ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా ఈ ఏడాది జరిగే కీలక సిరీస్‌లు, టోర్నమెంట్​లు సహా ఐపీఎల్‌ కూడా పంత్​ మిస్​ అయ్యాడు. ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ మొదలయ్యే లోపు కోలుకున్నా.. ఫిట్‌నెస్‌ నిరూపించుకుని జట్టులో స్థానం సంపాదించడం కష్టమే.

మరోవైపు, ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్​ బ్యాటర్ల ర్యాంకింగ్స్​లో పంత్​ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం అతడు తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. అతడితోపాటు టీమ్​ఇండియా మాజీ సారథి విరాట్​ కోహ్లీ ఏకంగా 8 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. సీనియర్​ ఆల్​రౌండర్​ అశ్విన్​ తొలిస్థానంలోనే ఉన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.