Rohit sharma twitter hack: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ట్విట్టర్ ఖాతా నుంచి వరుసగా సంబంధం లేని ట్వీట్లు వస్తున్నాయి. దీంతో ఆయన ఖాతాను ఎవరో హ్యాక్ చేసి ఉంటారని అభిమానులు అనుమానిస్తున్నారు. గంటల వ్యవధిలోనే రోహిత్ ఖాతా నుంచి ఏవోవో ట్వీట్లు వస్తుండటం ఇందుకు బలం చేకూర్చుతోంది. అంతేగాక ఎప్పుడూ ఐఫోన్ నుంచి ట్వీట్ చేసే రోహిత్.. ఈసారి ట్విట్టర్ డెక్ నుంచి ట్వీట్ చేసినట్లు కన్పించడం గమనార్హం.
Rohit sharma
ట్విట్టర్లో రోహిత్ ఖాతా నుంచి తాజాగా వచ్చిన ట్వీట్లు ఇవే..
- క్రికెట్ బాల్స్‌ని తినేయొచ్చు.. కరెక్టే కదా?
- మన గురించి ప్రచారమయ్యే గుసగుసలతో బాక్సింగ్ బ్యాగ్ నిండిపోతుంది.
- నాకు కాయిన్ టాస్‌లు అంటే మహా ఇష్టం.. ప్రత్యేకించి అవి నాకు అనుకూలంగా ఉన్నప్పుడు..
ఇలా మంగళవారం ఉదయం నుంచి రోహిత్ ట్విట్టర్ ఖాతా నుంచి వరుస ట్వీట్లు వస్తున్నాయి. ఇవి కచ్చితంగా రోహిత్ చేసినట్లు అన్పించడం లేదని అభిమానులు భావిస్తున్నారు. ఖాతా హ్యాక్‌కు గురైందని అంటున్నారు.
ఇటీవలి కాలంలో ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు వరుసగా హ్యాక్‌కు గురువతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ అకౌంట్‌ను కూడా కొద్ది రోజుల క్రితం ఎవరో హ్యాక్ చేశారు. ఆ తర్వాత కొద్ది సేపటికే దాన్ని అధికారులు పునరుద్ధరించారు. అయితే క్రికెటర్ల ఖాతాలు మాత్రం హ్యాక్ అయిన సందర్భాలు అరుదుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: సోషల్‌మీడియాలో ట్రోల్స్.. నెటిజన్లపై షమి ఫైర్!