Team India 2024 Schedule: గతేడాది అన్ని ఫార్మాట్లలో టీమ్ఇండియా అద్భుతంగా ఆడింది. ఐసీసీ టెస్టు, వన్డే ర్యాంకింగ్స్‌లోనూ నెం.1 స్థానాన్ని దక్కించుకుంది టీమ్ఇండియా. అయితే ఎన్ని విజయాలు సాధించినా డబ్ల్యూటీసీ, వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఓటమి క్రికెట్ ఫ్యాన్స్‌ను కలచివేసింది. దీంతో ఐసీసీ ట్రోఫీ నిరీక్షణ 12 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. అయితే 2024లో ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. ఈ టోర్నమెంట్‌లోనైనా రాణించి టైటిల్ పట్టేయాలని టీమ్ఇండియా భావిస్తోంది.
పొట్టి ప్రపంచకప్‌తోపాటు టీమ్ఇండియా ఆయా దేశాలతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనుంది. గతేడాది తప్పిదాలను సరిచేసుకొని, కొత్త సంవత్సరంలో మరింత మెరుగ్గా రాణించాలని టీమ్ఇండియా ఫ్యాన్స్ఆశిస్తున్నారు. మరి ఈ ఏడాది టీమ్ఇండియా పర్యటనలు ఏంటి? ఏయే దేశాలతో ఏయే ఫార్మాట్ క్రికెట్ ఆడనుంది? ఎప్పుడెప్పుడు ఆ మ్యాచ్‌లు జరగనున్నాయి. పూర్తి షెడ్యూల్ చూసేయండి.
జనవరి
- జనవరి 3 నుంచి 7 వరకు సౌతాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్ .
- స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో 3 మ్యాచ్‌ల టీ 20 సిరీస్. ఈ సిరీస్ జనవరి 11 నుంచి 17 వరకు జరగనుంది.
- భారత్- ఇంగ్లాండ్ 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్. జనవరి 25 నుంచి మార్చి 11 వరకు.
మార్చి- మే
- మార్చి- మే మధ్యలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉండనుంది.
జూన్
- ఐసీసీ టీ20 వరల్డ్‌కప్. వెస్టిండీస్, అమెరికా సంయుక్త వేదికగా జూన్ 4 నుంచి 30 వరకు టోర్నీ జరగనుంది.
జూలై
- భారత్, శ్రీలంక పర్యటనకు వెళ్తుంది. ఈ పర్యటనలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.
సెప్టెంబర్
- శ్రీలంక పర్యటన తర్వాత సెప్టెంబర్‌లో టీమ్ఇండియా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో పాల్గొననుంది. రెండు టెస్టు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.
అక్టోబర్
- భారత్- న్యూజిలాండ్ మధ్య స్వదేశంలో 3 టెస్టు మ్యాచ్‌ల సిరీస్.
నవంబర్
- ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో టీమ్ఇండియా ఈ ఏడాదిని ముగిస్తుంది. కానీ ఈ సిరీస్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఈ సిరీస్ దాదాపు 2024 నవంబర్ - 2025 జనవరి మధ్యలోనే ఉండనుంది.
-
📍Cape Town#TeamIndia have arrived for the second #SAvIND Test 👌🏻👌🏻 pic.twitter.com/VGCTdk7yzO
— BCCI (@BCCI) January 1, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">📍Cape Town#TeamIndia have arrived for the second #SAvIND Test 👌🏻👌🏻 pic.twitter.com/VGCTdk7yzO
— BCCI (@BCCI) January 1, 2024📍Cape Town#TeamIndia have arrived for the second #SAvIND Test 👌🏻👌🏻 pic.twitter.com/VGCTdk7yzO
— BCCI (@BCCI) January 1, 2024
-
మేనేజ్మెంట్కు మాజీ క్రికెటర్ ప్రశ్న - 'టెస్టు జట్టుకు విరాట్ ఎందుకు నాయకత్వం వహించడం లేదు?'
టీమ్ఇండియాకు షాక్ - శార్దూల్‌కు గాయం!- రెండో టెస్ట్‌కు డౌటే!