ETV Bharat / sports

Indw vs Engw t20: ఈ అద్భుత క్యాచ్​ చూశారా? - womens cricket t20 series

ఇంగ్లాండ్​తో జరిగిన​ తొలి టీ20 మ్యాచ్​లో అద్భుతమైన క్యాచ్​ పట్టిన హర్లీన్ డియోల్​ ఔరా అనిపించింది. భారత్​ మ్యాచ్ ఓడినా హర్లీన్ క్యాచ్ క్రికెట్​ అభిమానుల మదిని గెలుచుకుంది. పలువురు సీనియర్ క్రీడాకారిణులు సైతం ఈ క్యాచ్​ను కొనియాడారు.

Harleen Deol's stunning catch
హర్లీన్​ డియోల్ సూపర్​ క్యాచ్..
author img

By

Published : Jul 10, 2021, 10:20 AM IST

ఇంగ్లాండ్​, భారత్​ మహిళల జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్​ శుక్రవారం జరిగింది. ఇందులో అద్భుతమైన క్యాచ్​ పట్టిన హర్లీన్ డియోల్​ ఔరా అనిపించింది. 19వ ఓవర్​ వద్ద అమీ జోన్స్.. ఆఫ్​ సైడ్​లో భారీ షాట్​ ఆడగా.. బౌండ్రీ లైన్​ దగ్గర ఉన్న హర్లీన్ సూపర్​ మ్యాన్​లా క్యాచ్​ను పట్టింది. సిక్స్​ వెళ్తుందనుకున్న బాల్​ను క్యాచ్​ పట్టి జోన్స్​ను పెవిలియన్ పంపింది.

హర్లీన్​ క్యాచ్​ను ఇంగ్లాండ్ మాజీ క్రీడాకారణి ఇశా గుహ, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్​ సమి కొనియాడుతూ ట్వీట్​ చేశారు. హర్లీన్ క్యాచ్​ వీడియోను బీసీసీఐ సైతం ట్విట్టర్​లో పంచుకుంది. మ్యాచ్​ ఫలితం మాకు అనుగుణంగా లేదు కానీ ఆటలో ఓ ప్రత్యేకత ఉందంటూ ట్విట్టర్​లో రాసుకొచ్చింది.

19వ ఓవర్​లో కెప్టెన్ హర్మన్ ప్రీత్​ కౌర్​ సైతం స్టన్నింగ్ క్యాచ్​ పట్టింది. అప్పటికే అర్దశతకంతో దూసుకుపోతున్న నటాలియో సీవర్​ను ఔట్ చేసింది.

శుక్రవారం జరిగిన మ్యాచ్​లో ఇంగ్లాండ్​నే విజయం వరించింది. వర్షం కారణంగా 18 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలయ్యింది. 20 ఓవర్లలో ఇంగ్లాండ్​ 177 పరుగులు చేయగా.. భారత్​ 8.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది.

ఇవీ చదవండి: 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్' రేసులో షెఫాలీ, స్నేహ్​ రాణా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.