మరో నాలుగు రోజుల్లో టీమ్‌ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుందని అభిమానులు ఎంతో ఆతృత, ఉత్సాహంతో ఉన్నారు. అయితే క్రీడాభిమానులను ఓ విషయం కలవరానికి గురిచేస్తోంది. మెల్‌బోర్న్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందట. ఆరోజు భారీగా వర్షం పడే అవకాశాలున్నాయని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. 23వ తేదీన 80 శాతం వర్షం కురిసే అవకాశాలున్నాయని ఆస్ట్రేలియా వాతావరణశాఖ వెల్లడించింది. అంతకంటే ముందు రెండు రోజుల్లోనూ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఇదే జరిగి మ్యాచ్ గనక రద్దైతే అభిమానులకు తీవ్ర నిరాశ తప్పదు.
కాగా, ఇప్పటికే బ్రిస్బేన్ వేదికగా న్యూజిలాండ్‌తో బుధవారం జరగాల్సిన వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అంతకుముందు ఇదే మైదానంలో పాకిస్థాన్-అఫ్గాన్ జట్ల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ కూడా రద్దైంది. అఫ్గాన్ ఇన్నింగ్స్ పూర్తి కాగా.. పాక్ లక్ష్య ఛేదన చేస్తున్న క్రమంలో వర్షం అంతరాయం కలిగించింది. ఇప్పటికీ వర్షం తగ్గకపోవడంతో టీమ్‌ఇండియా-కివీస్ వార్మప్ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
ఇదీ చూడండి: కోహ్లీతో ఉన్న ఈ అందమైన అమ్మాయిలిద్దరు ఎవరబ్బా