టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమ్ఇండియా-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. పాక్ బౌలర్లు టీమ్ఇండియా బ్యాటర్లపై విరుచుకుపడుతున్నారు. తొలి పది ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది టీమ్ఇండియా.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లుగా దిగిన రోహిత్‌శర్మ(0), కేఎల్ రాహుల్(3).. తొలి రెండు ఓవర్లోనే షహీన్ అఫ్రిది బౌలింగ్‌లో వెనుదిరిగారు. ఐదో ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ హసన్ అలీ బౌలింగ్ షాట్‌కు యత్నించి కీపర్ రిజ్వాన్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక మూడో స్థానంలో వచ్చిన కోహ్లీ(26; 6x1, 4x1) జాగ్రత్తగా ఆడుతున్నాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(26), పంత్(19; 4x2) ఉన్నారు.