ETV Bharat / sports

యూఏఈలోనే టీ20 ప్రపంచకప్.. గంగూలీ వెల్లడి​ - భారత్ నుంచి టీ20 ప్రపంచకప్​ తరలింపు

టీ20 ప్రపంచకప్​ను భారత్​ నుంచి యూఏఈకి తరలించాలని ఐసీసీని కోరింది బీసీసీఐ. టోర్నీ నిర్వహణ నాటికి దేశంలో కరోనా పరిస్థితులను అంచనా వేయలేమని స్పష్టం చేసింది. అక్టోబర్​-నవంబర్​ నెలలో పొట్టి ప్రపంచకప్​ జరగనుంది.

T20 World Cup in India to be shifted to UAE
టీ20 ప్రపంచకప్
author img

By

Published : Jun 28, 2021, 3:05 PM IST

Updated : Jun 28, 2021, 3:50 PM IST

టీ20 ప్రపంచకప్​ను భారత్​ నుంచి యూఏఈకి తరలించనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ప్రకటించాడు. టోర్నీ నిర్వహించనున్న అక్టోబర్-నవంబర్​​ నెల నాటి కొవిడ్ పరిస్థితులను ఇప్పుడే అంచనా వేయలేమని తెలిపాడు. అందుకే టోర్నీ వేదికను భారత్​ నుంచి మార్చాలని ఐసీసీకి విన్నవించింది బీసీసీఐ.

"టీ20 ప్రపంచకప్​ వేదికను భారత్ నుంచి యూఏఈకి తరలించాలని నిర్ణయించాం. ఈ విషయాన్ని ఐసీసీకి విన్నవించాం. సంబంధిత విషయాలు త్వరలోనే వెల్లడిస్తాం" అని గంగూలీ పేర్కొన్నాడు.

కొవిడ్ వైరస్​ విజృంభణతో దేశంలో టోర్నీ నిర్వహణ కష్టమైంది. దీంతో ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని ఐసీసీ.. బీసీసీఐని మేలోనే అడిగింది. అందుకు నెల సమయం కోరింది బీసీసీఐ. జూన్​ 28తో ఆ గడువు ముగియనుంది. దీంతో టోర్నీ తరలింపు విషయం అధికారికంగా ఐసీసీకి తెలిపింది బీసీసీఐ.

ఇదీ చదవండి: Team India: టీమ్​ఇండియా.. మరో ఛాలెంజ్​కు సిద్ధం

ప్రణాళిక ఇలా..

టీ20 ప్రపంచకప్​ను అక్టోబర్​ 17 నుంచి ప్రారంభించాలని ఐసీసీ భావిస్తోంది. ఇంతకంటే ముందు యూఏఈ వేదికగా ఐపీఎల్​ రెండో దశ జరగనుంది. మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్​ను సెప్టెంబర్​ 19 నుంచి అక్టోబర్​ 15 వరకు జరపాలని యోచిస్తోంది బీసీసీఐ. అంటే ఈ రెండు టోర్నీలకు మధ్య రెండు రోజుల సమయం మాత్రమే ఉంటుందన్న మాట. రెండు టోర్నీల మధ్య సమయం తక్కువగా ఉండడం వల్ల ఆటగాళ్లకు ఇబ్బంది కదా అనిపించొచ్చు. అయితే ఐపీఎల్​లో ఆడే అగ్రశ్రేణి ఆటగాళ్లకు సమస్యేమీ ఉండదు. టీ20 ప్రపంచకప్​ తొలి రౌండ్​లో టాప్​-8 జట్లు పోటీ పడవు. అవి నేరుగా సూపర్​-12 మ్యాచ్​లు ఆడతాయి. టాప్​-8లో లేని బంగ్లాదేశ్, శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్, పపువా న్యూ గినియా తొలి రౌండ్లో తలపడతాయి.

ఈ ఎనిమిది జట్లలో నాలుగు సూపర్-12 దశకు అర్హత సాధిస్తాయి. తొలి రౌండ్ మ్యాచ్​లను యూఏఈతో పాటు ఒమన్​లో నిర్వహిస్తారు. ఐపీఎల్​ జరిగే దుబాయ్, అబుదాబి, షార్జా మైదానాల్లో పిచ్​లకు మళ్లీ మెరుగులు దిద్ది వాటినే సూపర్-12 దశ నుంచి టీ20 ప్రపంచకప్​ కోసం వినియోగిస్తారు. అంటే ప్రధాన జట్లు అక్టోబర్​ 24 నుంచి బరిలోకి దిగుతాయి. ఐపీఎల్​లో పాల్గొన్న ఆటగాళ్లకు అప్పటికే వారం రోజుల సమయం ఉంటుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమ్ఇండియా అట్నుంచి అటే యూఏఈకి వెళ్లనుంది. అందులో లేని క్రికెటర్లంతా సెప్టెంబర్ తొలి వారంలో అక్కడికి చేరుకుంటారు.

ఇదీ చదవండి: బయోబబుల్ అతిక్రమణ.. క్రికెటర్లపై విచారణకు ఆదేశం

Last Updated : Jun 28, 2021, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.