T20 World Cup 2024 Team India Captain : టీ20 వరల్డ్ కప్‌లో సారథిగా టీమ్ఇండియాను ఎవరు నడిపిస్తారన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. అందులో ముఖ్యంగా రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య ఇద్దరిలో ఎవరు కెప్టెన్‌గా ఉంటారనే చర్చ నడుస్తోంది. రోహిత్ శర్మ గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత నుంచి టీ20 మ్యాచ్‌ల్లో కనిపించలేదు. దీంతో ఈ పొట్టి కప్పులో భారత జట్టుకు కెప్టెన్ బాధ్యతలు హార్దిక్ చేపట్టే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ హార్దిక్ గాయం కావడం వల్ల అతడి అవకాశాలపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. దీని కారణంగా గ్యాప్ ఇచ్చినా, రోహిత్ శర్మ టీ20 కెప్టెన్ బరిలో ఉన్నాడు.
తాజాగా ఈ అంశంపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందిచాడు. మంచి ఫామ్‌లో ఉన్న వాళ్లకే సారథ్య బాధ్యతలు అప్పగించాలన్నాడు. 'రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉంటే, అతడు టీ20 ప్రపంచకప్‌లో జట్టును నడిపించాలి. అతడు ఫామ్‌లో లేకుంటే, ఫామ్‌లో లేని వారిని టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయకూడదు. కెప్టెన్సీ అనే ది ఒక బాధ్యత. అలాంటి వారు ముందుగా ప్లేయర్‌గా ఎంపిక కావాలి. ఆపై మిమ్మల్ని కెప్టెన్‌గా నియమిస్తారు. కెప్టెన్‌కి దుతి జట్టులో శాశ్వత స్థానం ఉండాలి. శాశ్వత స్థానం ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది' అని గౌతమ్ గంభీర్ తెలిపారు.
జట్టులో ప్లేయర్‌ను ఎంపిక చేయాలా వద్దా అనే నిర్ణయానికి వయసుతో సంబంధం లేదని కేవలం ఫామ్ మాత్రమే పరిగణలోకి వస్తుందని గంభీర్ అన్నాడు. 'రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత నిర్ణయం. రిటైర్ కావాలని ఆటగాడిపై ఎవరూ ఒత్తిడి చేయలేరు. ప్లేయర్‌ను ఎంపిక చేయకపోవడానికి సెలెక్షన్ కమిటీకి పూర్తి హక్కు ఉంది. కానీ ఎవరూ ప్లేయర్ నుంచి బ్యాట్ లేదా బాల్‌ను లాక్కోలేరు. మొత్తంగా ఫామ్‌కే అధిక ప్రాధాన్యం ఉంటుంది' అని గంభీర్ తెలిపాడు.
ఇటీవల ముగిసిన వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన ప్రదర్శ చేశాడు. 11 మ్యాచ్‌ల్లో 125.94 స్ట్రైక్ రేట్‌తో 597 పరుగులు చేశాడు. దీంతో టోర్నమెంట్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు.
2023 బాక్సాఫీసు లెక్కలు- ఈ ఏడాది అగ్రతారల ఆధిపత్యమెంత?
ఆరో ఏడాదిలోకి 'విరుష్క' పెళ్లి బంధం- అనుష్కను కోహ్లీ ఎలా ఇంప్రెస్ చేశాడో తెలుసా?